
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా సంఘీభావం తెలిపారు. పాదయాత్రగా సోమవారం గుత్తికి వచ్చిన జగన్ గుత్తి ఆర్‌ఎస్‌లోని కొట్రికె స్వగృహం వద్దకు రాగానే మధుసూదన్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీహరిగుప్తా తమ అనుచరులతో కలిసి జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మధుసూదన్ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌తో తన తండ్రి పద్మనాభయ్యశెట్టికి మంచి సంబంధాలుండేవని, తాను కూడా వైఎస్సార్ చలువ వల్లే ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా జగన్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగానే జగన్‌ను కలిశానని, తన రాజకీయ భవిష్యత్తును మార్చిలో ప్రకటిస్తానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment