సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌లో అధికార టీడీపీతో పాటు జనసేన పార్టీ నాయకులు పెట్రేగిపోతున్నారు. పలుచోట్ల దౌర్జన్యాలు, దాడులకు దిగుతూ ప్రజలు, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. (చదవండి: మర్డర్లు నాకు కొత్తకాదు)
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 183వ నంబర్ పోలింగ్ బూత్‌లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మదుసూదన్ గుప్తా విధ్వంసానికి పాల్పడ్డారు. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవంటూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ను ధ్వంసం చేశారు. ఓటింగ్ ఛాంబర్‌లో శాసనసభ, లోక్‌సభ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊడిపోతూ ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విధ్వంసానానికి దిగితే ఎల్లో మీడియా మాత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఈవీఎం ధ్వంసం చేశారని రిపోర్ట్ చేయడం శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment