రాయలతెలంగాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోపాటు10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు.
తెలంగాణకు అనుకూలంగా టీఆర్ఎస్ ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఆ సమావేశాలు 12 రోజులపాటు జరగనున్నాయి.