'రాయలసీమను విభజించి కాశ్మీర్లా మారుస్తారా' | TDP MP Modugula Venugopal Reddy takes on Congress Party | Sakshi
Sakshi News home page

'రాయలసీమను విభజించి కాశ్మీర్లా మారుస్తారా'

Published Thu, Dec 5 2013 1:44 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'రాయలసీమను విభజించి కాశ్మీర్లా మారుస్తారా' - Sakshi

'రాయలసీమను విభజించి కాశ్మీర్లా మారుస్తారా'

కాంగ్రెస్ పార్టీపై నరసరావుపేట ఎంపీ ఎం.వేణుగోపాలరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన అంటూ ఆంధ్రప్రదేశ్ను రావణకాష్టంగా మార్చి... ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తగవులు పెట్టారంటు ఎం.వేణుగోపాలరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగు జిల్లాతో ఉన్న రాయలసీమను విభజించి కాశ్మీర్లాగా మారుస్తారా అని ఆ పార్టీని ప్రశ్నించారు. ఎవరు అడిగారని రాయలసీమను విభజిస్తున్నారంటూ ఆయన ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

 

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ కలుపుతు రాయలతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది. దీనిపై అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర నేతలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement