రె‘ఢీ’ | Ready | Sakshi
Sakshi News home page

రె‘ఢీ’

Published Fri, Sep 4 2015 11:42 PM | Last Updated on Fri, May 25 2018 5:49 PM

రె‘ఢీ’ - Sakshi

రె‘ఢీ’

విశాఖపట్నం : జాతీయ స్థాయిలో పోటీపడేందుకు జూనియర్ అథ్లెట్లు సిద్ధమయ్యారు.  విశాఖ పోర్ట్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాక్, ఫీల్డ్ అంశాల్లో అండర్14కు ఐదు అంశాల్లో, అండర్16కు పది అంశాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా ఈ పోటీలు జరగనున్నాయి.  పరుగు నిర్వహించేందుకు 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, త్రో ఈవెంట్స్‌కు సర్కిల్స్, జంప్ ఈవెంట్‌కు పిట్‌లను సిద్ధం చేశారు.  జావెలిన్, హైజంప్‌లకు సైతం సామగ్రిని అందుబాటులో ఉంచారు.  జాతీయ జట్టుకు ఎదిగేందుకు ప్రాథమిక ఎంపిక ఈ మీట్ నుంచే జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

జిల్లా స్థాయిలోనే ప్రతిభను గుర్తించేందుకు జాతీయ కోచ్‌లు కూడా మీట్‌కు రానున్నారు. 30మంది విజేతలతో పాటు చక్కటి ప్రతిభ కనబరిచిన అథ్లెట్లను ప్రాబబుల్స్‌గా ఎంపిక చేస్తారు. జూనియర్ అథ్లెట్లు ఏ మేరకు అవకాశాన్ని వినియోగించుకోనున్నారో తేలాల్సి ఉంది.

 ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకాలు
 ఈ మీట్‌ను రాష్ట్ర మంత్రులు ఉద యం ఎనిమిదిన్నరకు ప్రారంభిస్తా రు. సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు   పతకాలు అందజేస్తారు.  తొలిరోజు శనివారం అండర్ 14 బాలుర లాంగ్‌జంప్, అండర్16 షాట్‌పుట్ అంశాల్లో విజేతల్ని తేల్చేయనున్నారు.  బాలికల అండర్16 జావెలిన్ త్రోతో పాటు అండర్ 14 బాల బాలికల విభాగాల్లో 600 మీటర్ల పరుగు ఫైనల్స్‌ను ముగించి విజేతలకు పతకాలు  ఇస్తారు.  

 జిల్లా జట్టుకు కిట్ పంపిణీ
 జిల్లా జట్టుకు ఎంపికైన 13 మంది జూనియర్ అథ్లెట్లకు స్పోర్ట్స్ కిట్లను శుక్రవారం అందించారు. క్రీడాదుస్తుల్ని స్టేట్‌బాంక్ గ్రూప్ ప్రతినిధి ప్రసాద్ అందించగా షూలను విశ్రాంత డీఎస్పీ టిఎస్‌ఆర్ ప్రసాద్ అందచేశారు. అండర్14 బాలుర విభాగంలో నలుగురు, బాలికల విభాగంలో ముగ్గురు, అండర్ 16 బాలుర విభాగంలో ఐదుగురు, బాలికల విభాగంలో ఒక్కరు జిల్లా తరపున మీట్‌లో తలపడనున్నారు.

 ఏర్పాట్లపై సమీక్ష  
 శుక్రవారం ఉదయాన్నే జిల్లా కలెక్టర్‌తో పాటు నిర్వాహక కమిటీ ఇన్‌చార్జ్‌లు పోర్ట్‌స్టేడియానికి చేరుకున్నారు. ప్రారంభ వేడుక  ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.  స్టేడియంలో పోటీపడే ట్రాక్, ఫీల్డ్‌లో ఏర్పాట్లు సమీక్షించారు.  మంచినీటి ఏర్పాటుతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేయాల్సిన వసతులను నోడల్ ఆధికార్లు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.

  తొలి రోజు పోటీ అంశాలు
 అండర్ 14 బాలికల 600 మీటర్ల హీట్స్‌తో పోటీలు మొదలుకానున్నాయి. అండర్ 14, 16ల్లో బాల, బాలికల విభాగాల్లో లాంగ్‌జంప్, షాట్‌పుట్ క్వాలిఫయింగ్ రౌండ్స్ జరగనున్నాయి.  బాలుర అండర్ 14లో 600మీటర్ల హీట్స్, అండర్16 బాలుర 100 మీటర్ల తొలిరౌండ్, అండర్ 16 బాలికల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్స్, అండర్ 16 బాలికల 100 మీటర్ల తొలిరౌండ్ పో టీల అనంతుం భోజన విరామం ఉంటుంది.  100 మీటర్ల రెండో రౌం డ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఫైనల్స్, 100మీటర్ల రెండో రౌండ్, జావెలిన్ త్రో ఫైనల్స్, హైజంప్ క్వాలిఫయింగ్ రౌండ్స్, 100 మీటర్ల సెమీ స్, వెయ్యిమీటర్లు హీట్స్ అనంతరం 600మీటర్ల ఫైన ల్స్‌తో ఆయా కేట గిరిల్లో తొలిరోజు పోటీలు ముగుస్తాయి.
 
 జిల్లా యంత్రాంగానిదే వసతి బాధ్యత
 మూడు వేలకు పైగా జూనియర్ అథ్లెట్లు, 500కు పైగా టెక్నికల్ అఫిషియల్, కోచ్, మేనేజర్లు ఈ మీట్ కోసం రానున్నారు.  రిసెప్సన్, రవాణా, వసతి, రక్షణ, వైద్య తదితర సేవల్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది.  దాదాపు పాల్గొనే అథెట్లు అంతా విశాఖ చేరుకున్నట్లే.  అర్హత కలిగిన వారు పోటీలకు అనుమతిస్తారు. మీట్ జరిగే మూడు రోజులు భోజన వసతి సమాఖ్య చూసుకుంటుంది.  
-జిల్లా కలెక్టర్ యువరాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement