
లంచం ఇస్తే...నిబంధనలు ఉండవా ?
లంచం ఇస్తే నిబంధనలు తుంగలో తొక్కేస్తారా...అంటూ కౌన్సిలర్లు శరవణ్‌కుమార్,చిర్రి నాగేశ్వరరావు సోమవారం దేవస్థానం
శ్రీకాళహస్తిలో టీడీపీ కౌన్సిలర్ల మండిపాటు
దేవస్థానం టెండ ర్ల వ్యవహారంపై నిలదీత
శ్రీకాళహస్తి: లంచం ఇస్తే నిబంధనలు తుంగలో తొక్కేస్తారా...అంటూ కౌన్సిలర్లు శరవణ్‌కుమార్,చిర్రి నాగేశ్వరరావు సోమవారం దేవస్థానం పరిపాలన భవనం లో వీరంగం సృష్టించారు. నాలుగు రోజుల క్రితం ఆలయ పరిపాలన భవనంలో సెక్యూరిటీ,అన్నదానం సిబ్బంది కోసం టెండర్లు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఆ టెండర్లు హెదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు దక్కినట్లు ఆలయాధికారులు లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టెండర్లు వేసిన టీడీపీ ము న్సిపల్ కౌన్సిలర్లు శరవణ్‌కుమార్,చిర్రి నాగేశ్వరరావు తమ అనుచరులతో ఆలయ పరిపాలన భవనంలోని ఎస్టాబ్లిస్‌మెంట్ విభాగ అధికారి రవిశంకర్‌తో వాగ్వివాదానికి దిగారు. నిబంధనల ప్రకారం తామే తక్కువగా కోడ్ చేసినా స్థానిక నాయకుల ఒత్తిళ్లతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి టెండర్ కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలా చేస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. మార్చిలో ఇదే టెండర్లలో తామే తక్కువగా కోడ్ చేస్తే రాజకీయాలు చేసి వాటిని రద్దు చేసి ఏప్రిల్‌లో మరోసారి టెండర్లు నిర్వహించారని, రెండోసారి తామే తక్కువకు కోడ్ చేసినా నాయకుల ఒత్తిళ్లతో,ముడుపులకు ఆశపడి హైదరాబాద్‌వాసికి టెండర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారి రవిశంకర్ మాట్లాడుతూ ఆలయానికి ఏసీబీ,విజిలెన్స్ దాడులు కొత్తేమీకాదని, టెండర్ల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సమాధానమిచ్చారు. టెండర్లు ఇక్కడ ఖరారు చేయడంలేదని,హెదరాబాద్‌లోనే దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపుతున్నామని, ఏదైనా ఉంటే కమిషనర్‌కు చెప్పుకోవాలని చెప్పా రు.ఇలాంటి రాజకీయాలు సిగ్గుచేటని, ఎలా టెం డర్లు దక్కించుకోవాలో తెలుసని కౌన్సిలర్లు వెళ్లిపోయా రు.
రెండు వర్గాలుగా చీలిన తెలుగుతమ్ముళ్లు
దేవస్థానం టెండర్లతో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. దేవస్థానంలో సెక్యూరిటీ, అన్నదానం సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడానికి టెండర్ల నిర్వహణకు మార్చి 23న ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో ఎనిమిది టెండర్లు వేశారు. అయితే పట్టణంలోని ప్రధాన టీడీపీ నాయకుడి అనుచరుడికి టెండర్ దక్కకపోవడంతో వారు ఈవో కార్యాలయం వద్ద బీభత్సం సృష్టించారు. తమవాళ్లకే టెండర్లు ఇవ్వాలి...లేదంటే ఎంతటి అధికారికైనా బదిలీ తప్పదని హెచ్చరిం చారు.దీంతో టెండర్లు దేవస్థానంలో ప్రకటించకుండా కమిషనర్‌కు పంపించారు. వాటిని ఆయన రద్దు చేసి మరోసారి టెండర్లు నిర్వహించాలని ఈవోనుఆదేశించారు. దీంతో ఏప్రిల్ 23న ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు ఆరుగురు టెండర్లు వేశారు. అయితే రెండోసారి టెండర్లలో టీడీపీకి చెందిన మరో వర్గానికి దక్కే లా లేకపోవడంతో వివాదాలు చోటుచేసుకున్నాయి. టెండర్లలో పోటీపడిన తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్టేననే విమర్శలు చేస్తున్నారు.