కన్నూరుపాలెం వేబ్రిడ్జిలో దోపిడీ | Robbery in Way bridge | Sakshi
Sakshi News home page

కన్నూరుపాలెం వేబ్రిడ్జిలో దోపిడీ

Published Mon, Aug 24 2015 4:21 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Way bridge

విశాఖపట్నం (కసీంకోట) : విశాఖ జిల్లా కసీంకోట మండలం కన్నూరుపాలెం గ్రామంలో ఉన్న సరుగుడు వేబ్రిడ్జిలో ఆదివారం రాత్రి దోపిడీ జరిగింది. దీనికి సంబంధించి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. అప్పలనాయుడు అనే వ్యక్తికి చెందిన ఈ వేబ్రిడ్జిలో రాత్రి సమయంలో ఐదుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు.

వేబ్రిడ్జిలో పనిచేసే వ్యక్తిని కట్టేసి కౌంటర్‌లో ఉన్న రూ.2.7 లక్షల నగదుతోపాటు, 2 తులాల బంగారం దోచుకెళ్లారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను వారం రోజుల్లో పట్టుకుంటామని పోలీసులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement