=టెండర్ కాకుండానే పనులు ప్రారంభం
=మేడారం పనుల్లో అక్రమాలు
=కాంట్రాక్టర్లకు సంబంధితశాఖ అధికారుల అండ?
=ఉన్నతాధికారుల మౌనంపై సందేహాలు
సాక్షి, హన్మకొండ : మేడారం జాతర పనుల్లో చిన్ననీటి పారుద ల శాఖ అధికారు లు పెద్దస్థాయిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా రు. టెండరు ప్రక్రియ ముగియక ముందే కాంట్రాక్టర్లకు పను లు చేసే వెసులుబాటు కల్పిస్తూ అక్రమాలకు అండగా నిలుస్తున్నారు. అనధికార నామినేషన్ పద్ధతిని అమలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తున్నారు. తొమ్మిది కోట్ల రూపాయలతో జంపన్నవాగు వెంట నిర్మిస్తున్న స్నానఘట్టాల్లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టరు కలి సి తొండాటకు తెరలేపారు.
ఈ పని చేసేందుకు అడ్డుగా వస్తున్న నిబంధనలను జంపన్న వాగు లో పాతరేస్తున్నారు. స్నానఘట్టాల పనుల కో సం ఐదు కంపెనీలు పోటీ పడుతున్నా అధికారుల అండతో ఒక కంపెనీ చెందిన కాంట్రాక్టర్ అడ్డగోలుగా పనులు ప్రారంభించాడు. పని తనకు తప్ప మరెవరికి దక్కదనే ధీమాతో ఇప్పటి కే జంప్నవాగు వెంట మెటీరియల్ పోయిం చా రు. శుక్రవారం మరో అడుగు ముందుకేసి ఏ కంగా డోజర్ సాయంతో జంపన్నవాగు వెంట పిచ్చి మొక్కలు తొలగించి చదును చేశారు.
శని, ఆదివారాల్లో మరికొంత మెటీరియల్‌తో పాటు రెండు పొక్లెయినర్లను జంపన్న వాగు వెంట పనులు చేసేందుకు సిద్ధంగా ఉంచారు. పనులు చేపట్టేందుకు ఎటువంటి అధికారం లేకపోయినా సదరు కాంట్రాక్టర్ భారీస్థాయిలో ముందస్తు పనులకు శ్రీకారం చుట్టారు. కోట్లాది రూపాయల వ్యయం చేసే పనులను ఇంత ధైర్యంగా ప్రారంభించడానికి కారణం అధికారు ల అండదండలు తప్ప మరొకటి కాదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జాతరపేరు చెప్పి నిబంధనలు పాటించకుండా హడావుడి గా నాసిరకం పనులు చేపట్టి సర్కారు ఖజానా ను కొల్లగొడుతున్నారు.
టెండర్‌కే టెండర్..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2014 ఫిబ్రవరిలో 12 నుంచి జరుగనుంది. అయితే జాతరను పురస్కరించుకుని భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు జంపన్నవాగు వెంట రూ 20.35 కోట్లతో 1100 మీటర్ల పొడవునా స్నానఘట్టాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, ఈ పనులను చిన్న నీటిపారుదల శాఖ చేపడుతోంది. అయితే ఇందులో భాగంగా జాతరకు ముందే రూ 9.81 కోట్ల వ్యయంతో జంపన్నవాగు వెంట భక్తులు స్నానం చేసేందుకు 420 మీటర్ల పొడవునా స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ టాప్స్ నిర్మాణంతో పాటు జంపన్నవాగులో కొత్తగా ఫిల్టరేషన్ వెల్స్ అం తకు ముందే ఉన్న పాతబావుల్లో పూడిక తీ యడం వంటి పనులు చేపట్టేలా నిర్ణయిం చారు. ఇందుకు సంబంధించిన టెండర్లను 2013 డిసెంబర్ 6న ఆహ్వానించారు. టెండర్లు దాఖలు చేయడానికి డిసెంబర్ 12 ఆఖరు తేదీ కాగా, ఇప్పటివరకు సాయిదత్తా, జంగా, సాయిరాం, శ్రీరామ, సుజల, నందిత మొత్తం ఆరు కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఈ పనిని చేపట్టేం దుకు టెండర్లు దాఖలు చేశాయి.
అంతకు ముందే...
పేరుకే టెండర్ల ప్రక్రియ తప్ప, అంతకు ముందే ఈ పనులను నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తమతో అంటకా గే కంపెనీకి స్నానఘట్టాల నిర్మాణ పనులు అప్పగించేశారు. వాస్తవానికి డిసెంబర్ 12 టెండర్లకు దాఖలు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 13న టెక్నికల్ బిడ్ తెరవాలి. పనులు చేపట్టేందుకు ఆసక్తి చూ పించిన కంపెనీలు వ్యక్తపరిచిన అంశాలను పరి శీలించి, ఏ కంపెనీ తక్కువ ధరతో నాణ్యత తో పనులు చేపడుతుందని తేలితే ఆ కంపెనీకిని ర్మాణ పనులు కేటాయించాలి. అంటే ఎంత త్వరగా నిర్మాణ పనులు మొదలు పెట్టినా డిసెంబర్ 17వ తేదీ తర్వాత పను లు ప్రారంభంకావాలి. కానీ.. పైన పటా రం.. లోన లోటారం.. అన్నట్లుగా పైకి నిబంధనల ప్రకారం టెండర్ల పని నడుస్తున్న ట్లు అనిపించినా... చాపకింద నీరులా ఈ పనిని అనధికారికంగా తమ అనుచర గణానికి అధికారులు అప్పగించేశారు.
ఇరిగేషన్ వారి నామినేషన్
Published Mon, Dec 16 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement