ముప్పాళ్ల (గుంటూరు): గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 25 ఎకరాల వరిగడ్డి కాలి బూడిదైంది. వివరాలు.. గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డికి చెందిన పదెకరాల గడ్డితోపాటు మరి కొందరికి చెందిన 15 ఎకరాల గడ్డి వాములు గ్రామంలో ఒకే చోట ఉన్నాయి.
శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు రేగి.. గమనించే లోపే వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలోని నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు ఫోన్లు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
రూ.1.50 లక్షల విలువైన వరిగడ్డి దగ్ధం
Published Fri, May 29 2015 9:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement