ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం మర్రివలస గ్రామ శివారులో అక్రమంగా లారీలో తరలిస్తున్న గంజాయిని భారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో లారీ డ్రైవర్తో పాటు మరికొందరు వ్యక్తులు లారీని వదిలి పరారైయ్యారు.
పోలీసులు గంజాయిని సీజ్ చేసి లారీని పోలీసు స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.