జిల్లాకు చెందిన ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు మూడు జిల్లాల్లో (జోన్) ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికయ్యూరు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా..అప్రమత్తంగా ఉండటంలో వారికి వారే సాటి. గతంలో కూడా ఎన్నో సార్లు ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన వీరిద్దరూ 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మరింత గుర్తింపు పొందారు.
ఇతనే.. బెస్ట్ డ్రైవర్
పొదిలి: తన్నీరు సుబ్బయ్య ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకుంటే ప్రయూణికులు సీట్లలో హాయిగా నిద్రపోతారు. ఇలా 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తన్నీరు సుబ్బయ్య ప్రస్తుతం పొదిలి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. కేవలం ఉత్తమ డ్రైవర్‌గానే కాకుండా.. ఇంధన పొదుపులోనూ తోటి వారికి ఆదర్శంగా నిలిచారు. అందుకే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఆర్టీసీ జోన్ పరిధిలో బెస్ట్ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. తన సుదీర్ఘకాలం డ్రైవింగ్‌లో ఒక్క యూక్సిడెంట్ చేయకుండా అందరి ప్రశంసలందుకుంటున్నారు. సుబ్బయ్య స్వగ్రామం కొనకనమిట్ల మండలం చినమనగుండం. ఆర్టీసీ బస్సును ఎంత భద్రంగా కాపాడతారో తన కుటుంబాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారనే పేరు చుట్టుపక్కల పల్లెల్లో ఉంది. 1980లో డ్రైవర్‌గా చేరి మూడు సంవత్సరాల పాటు ఒంగోలు-గిద్దలూరు ప్రైవేటు బస్సు సర్వీస్‌ను నడిపారు. 1983లో ఆర్టీసీ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, బెంగళూరు, నె ల్లూరు వంటి దూరపు సర్వీసులు నడపాలంటే ముందుగా సుబ్బయ్య పేరు గుర్తుకొస్తుంది. ఏ డిపోలో ఏ సర్వీస్‌కు పనిచేసినా, జీరో యాక్సిడెంట్ అతని సర్వీస్ రికార్డు. ఇప్పటి వరకు డిపో, జిల్లా, రీజియన్, జోనల్ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. ఈయన భార్య అనసూర్య పొలం పనులు చేస్తుంది. మొదటి కుమారుడు వెంకటేశ్వర్లు ఇంటి వద్దనే ఉంటుండగా.. రెండో కుమారుడు శ్రీనివాసులు మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మూడో అబ్బారుు రాంబాబు ఎంసీఏ పూర్తి చేసి ఫార్మాస్యూటికల్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
ప్రశాంతంగా ఉంటా: సుబ్బయ్య
దేవుని దయవల్ల సర్వీస్ కాలంలో ఎక్కడా ఎటువంటి ప్రమాదం కాలేదు. ప్రశాంతంగా బస్సు నడపటమే ఏకైక విజయ రహస్యం. శిక్షణ, కౌన్సెలింగ్ సమయంలో నిపుణులు చెప్పే విషయాలను పాటించాలి. నాలుగైదు నెలల్లో రిటైర్డ్ అవుతా. అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలి.
బాషా డ్రైవ్ చేస్తే....
కందుకూరు: దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రయూణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాలనే తపన కందుకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌కే మహబూబ్ బాషాకు పుష్కలంగా ఉంది. అందుకే ఇప్పటికి 11సార్లు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డులందుకున్నారు. 1985లో విధుల్లో చేరిన ఈయన దాదాపు 29 సంవత్సరాల సర్వీసు కాలంలో ఇప్పటికీ చిన్న ప్రమాదాన్ని కూడా చేయలేదు. బాషా నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ‘నేను సిగరెట్, కిళ్లీ, గుట్కా వంటి వాటికి దూరంగా ఉంటా. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఉపయోగించను. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేస్తుండటం బాధాకరం. నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. పదుల సంఖ్యలో ప్రాణాలు నా చేతుల్లో ఉన్న విషయూన్ని ఎప్పటికీ మరవను.
సేఫ్ జర్నీ అందిస్తారు..
Published Thu, Jan 22 2015 10:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement