సైన్స్‌తోనే సమాజాభివృద్ధి | Sainstone samajabhivrddhi | Sakshi
Sakshi News home page

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

Published Sat, Feb 28 2015 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

Sainstone samajabhivrddhi

ముగిసిన సైన్స్ దినోత్సవ సెమినార్
 
ఎచ్చెర్ల: సైన్‌‌సతోనే సమాజాభివృద్ధి సాధ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అన్నారు. వర్సిటీ సెమినార్ హాల్‌లో డిపార్టమెంట్ ఆఫ్ అటానమిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అటానమిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల సైన్స్ దినోత్సవ సెమినార్ శుక్రవారంతో ముగిసింది. ఈ సమావేశంలో వీసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సైన్స్‌పై అవగాహన అవసర మన్నారు.

శాస్త్రవిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య మాట్లాడుతూ సీవీ రామన్‌లాంటి జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే నేడు దేశం ప్రగతి సాధించిందన్నారు. అటానమిక్ శాస్త్రవేత్తలు డాక్టర్ యు.గంగాధర్‌రావు, డాక్టర్ ప్రసాదరావులు శాస్త్రవిజ్ఞానం వల్ల కలిగే సమాజానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో బీచ్‌సాండ్ అండ్ ఆఫ్‌షోర్ ఇన్విస్టిగేషన్స్ ఇన్‌చార్జి అనిల్‌కుమార్, వర్సిటీ చీఫ్‌వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, జియోసైన్స్ విభాగం సమన్వయకర్త డాక్టర్ కోరాడ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
 
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
సెమినార్ సందర్భంగా ప్రస్తుతం ‘విద్యుత్ సరఫరా పరిస్థితి-భవిష్యత్ అవసరాలు’ అన్న అంశంపై జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో 68 మంది విద్యార్థులు మాట్లాడారు. సీనియర్స్ విభాగంలో మొదటి నాలుగు స్థానాల్లో సీహెచ్ చిన్నికృష్ణంనాయుడు(గీతాంజలి పాఠశాల, శ్రీకాకుళం), సీహెచ్ జ్యోత్స్న (సెయింట్ జోషప్ హైస్కూల్, శ్రీకాకుళం), పి.భావన (గీతాంజలి), మౌనిక(గాయత్రి శ్రీకాకుళం), జూనియర్స్ విభాగంలో బి.సాయియశ్వన్ (గాయత్రి), ఆర్.సిద్ధార్థ(సెయింట్ లారెంట్, నరసన్నపేట), ఎస్.శ్రీవర్షిని(గీతాంజలి), బి.పద్మప్రియ (సెయింట్ లారెంట్)లు విజేతలుగా నిలిచారు. వీరికి రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య చేతులమీదుగా బహుమతులు అందజేశారు. పోటీల న్యాయనిర్ణేతలుగా ఫ్యాకల్టీ సభ్యులు ప్రకాశం, రవికుమార్ ,శ్రీరాంమూర్తిలు వ్యవహరించారు.
 
ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు
సెమినార్ హాల్ ఆవరణలో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నా యి. విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించాయి. భూమి లోపల పొరలు, ఇసుకలో ఖనిజాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, అణుపార్కుల పనితీరు, భవిష్యత్తులో అణువిద్యుత్ ప్రాధాన్యం, సైన్స్ విస్తరణ వంటి అంశాలను ప్రయోగాత్మకంగా విద్యార్థులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement