‘వార్‌ వన్‌ సైడే.. వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడం ఖాయం’ | SDF President Gurunatham Comments On YS Jagan | Sakshi
Sakshi News home page

‘వార్‌ వన్‌ సైడే.. వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడం ఖాయం’

Published Sun, Mar 31 2019 3:35 PM | Last Updated on Sun, Mar 31 2019 3:37 PM

SDF President Gurunatham Comments On YS Jagan - Sakshi

సాక్షి, విజయవాడ : ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా మోసమోననీ.. ఈ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు మాదగాని గురునాధం స్పష్టం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహుజన రాజకీయ జనచైతన్య బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారని తెలిపారు. దళితులకు ఏ రాయితీలు రాలేదదని, మధ్యలో దళారీలు మోసం చేస్తున్నారని తమ ఆవేదను బస్సు యాత్రలో వెల్లిబుచ్చుకుంటున్నారన్నారు. పథకాలు గ్రౌండ్‌ లెవల్‌లో ఎవరికీ చేరడంలేదని, జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్‌కు ప్రజలనుంచి మంచి ఆదరణ లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడేనని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement