‘పొగాకు’ రక్షణకు శాస్త్రవేత్తల్ని పంపండి
కేంద్ర మంత్రులకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ ఏడాది పొగాకు పంటను ‘బరబాంకి’ అనే పరాన్నజీవి దెబ్బతీస్తోందని, దీని నుంచి పంటను కాపాడుకునేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని పంపాల్సిందిగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కు లేఖ రాశారు. పొగాకు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాష్ట్రంగా ఉందని, అందులో ప్రకాశం జిల్లా లో అత్యధికంగా పొగాకు సాగు చేస్తున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో 38,341 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారని, ఈ పరాన్న జీవి కారణంగా రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు.