సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి రాధాకృష్ణ మృతి | Senior Telugu scribe Radhakrishna dies of cardiac arrest | Sakshi
Sakshi News home page

సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి రాధాకృష్ణ మృతి

Published Sun, Jul 20 2014 5:13 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

Senior Telugu scribe Radhakrishna dies of cardiac arrest

కాకినాడ: సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి రాధాకృష్ణ(75) గుండెపోటుతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ట్రెజరీ కాలనీలో తన కుమారుడు నివాసంలో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ప్రస్తుతం ఆయన 'కాకతీయ' తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నారు. 'ఈనాడు'లో రిపోర్టర్ గా కెరీర్ ఆరంభించిన నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజంలో సేవలందించారు. రాధాకృష్ణ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement