జిల్లాపై సీఎం సవతి ప్రేమ | Several Companies Are Closed In Srikakulam | Sakshi
Sakshi News home page

జిల్లాపై సీఎం సవతి ప్రేమ

Published Fri, Aug 3 2018 11:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Several Companies Are Closed In Srikakulam - Sakshi

శ్రీకాకుళం రోడ్డులో మూతపడిన కర్మాగారం 

రాజాంరూరల్‌ : రాష్ట్రంలో అత్యధికంగా వలసలున్న జిల్లా ఏదంటే శ్రీకాకుళమే అని ఎవ్వరైనా ఠక్కున చెబుతారు. అటువంటి వెనుకబడిన మన జిల్లాపై సీఎం చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు.

పారిశ్రామిక ప్రగతిలో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్న ఈయనకు రాజాంలో మూతపడ్డ పరిశ్రమలుగానీ, కార్మికుల దైన స్థితిగతులుగానీ పట్టకుండా పోయాయి. తన సొంత జిల్లా చిత్తూరులోని శ్రీసిటీపైనే మక్కువ చూపిస్తున్నారు. అక్కడ విస్తారంగా కంపెనీల ఏర్పాటు చేస్తూ వెనుకబడిన మన జిల్లాను విస్మరిస్తున్నారు. 

జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా రాజాంకు వస్తే పనిదొరుకుతుందనే భరోసా గతంలో ఉండే ది. పారిశ్రామిక వాడగా ప్రసిద్ధికెక్కిన ఇక్కడ గతంలో 34 వరకు చిన్నా పెద్ద పరిశ్రమలు ఉండే వి. వీటిలో 11 జ్యూట్‌ పరిశ్రమలు, మిగిలిన వాటిలో ఐరన్, సింథటిక్, అల్యూమిలియం, సైకిల్‌ రిమ్స్‌ అండ్‌ ఫోక్స్, కేబుల్‌ వైర్‌ ఇండస్డ్రీస్, పైపులు, యార్న్‌ పరిశ్రమలతోపాటు సిమెంటు పరిశ్రమలు ఉండేవి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి పైగా కార్మికులు పనిచేసేవారు.  

మూతపడిన పరిశ్రమలివే..

గతంలో వేలాది మందికి ఉపాధినిచ్చే శ్రీకాకుళం రోడ్డులో వాసవీ సిమెంట్, ఎస్‌కేపీ బేరింగ్స్, ఎస్‌ఎంఎల్‌ డైటెక్స్, వాసవీ పైపులు, వాసవీ రిమ్స్‌ అండ్‌ ఫోక్స్, వాసవీ స్టీల్స్, సరితా స్టీల్స్, సరితా సింథటిక్స్, కన్యా కేబుల్స్, కన్యా బోర్డ్స్‌ తదితర పరిశ్రమలు ప్రస్తుతం మూతపడ్డాయి.

చీపురుపల్లి రోడ్డులో సీతారామ జ్యూట్‌ ఫ్యాక్టరీ మూతపడగా, బొబ్బిలి రోడ్డులో రాజాం అల్యూమినియం ప్రొడక్స్‌న్‌› ఫ్యాక్టరీ, పాలకొండ రోడ్డులో సరస్వతీ ప్యాకింగ్స్‌తోపాటు పలు ఆయిల్‌ మి ల్లులు మూతపడ్డాయి.

దీంతో సుమారు 10వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం రాజాంలో నాలుగు జ్యూట్‌ ఫ్యాక్టరీలు మాత్రమే పడుతూ.. లేస్తూ పనిచేస్తున్నాయి. వీటిలో 2 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు.

ప్రోత్సాహం కరువు..

ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండేది. ముడిసరుకు కొనుగోలుకు రుణాలు అందేవి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలు ఫ్యాక్టరీ యజమానులకు సాయం అందించేవి.

కార్మికులకు కూడా పలు సంక్షేమాన్ని చూపేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. కార్మిక సంక్షేమం మూలన పడింది. ఫలి తంగా ఫ్యాక్టరీల యజమానులు చేతులెత్తేశారు. అమాంతంగా తమ వ్యాపారాలను, ఫ్యాక్టరీలను మూసేశారు.

సర్కారు ఏమీ పట్టనట్లు వ్యవహరిం చడంతో కార్మికులంతా రోడ్డునపడ్డారు. పలు పర్యాయాలు ధర్నాలు, దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా రాజాంలో కార్మి కులతోపాటు ఇక్కడకు వచ్చి వెళ్లే వేలాది మంది కార్మికులు పొట్ట చేతపట్టి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది పస్తులతో కాలం నెట్టుకొస్తున్నారు.

శ్రీసిటీలోనే కంపెనీలన్నీ..

చిత్తూరు – నెల్లూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేసిన శ్రీసిటీలో టీడీపీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా కంపెనీ లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ జిల్లాలు చెన్నైకు దగ్గరలో ఉన్నాయని బూచిగా చూపిస్తూ ఉత్తరాంధ్రకు రావాల్సిన కంపెనీలన్నింటినీ తరలించుకుపోతున్నారు. వాస్తవంగా చిత్తూరు తన సొంత జిల్లా కావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయించుకుంటున్నారు.

అక్కడ సెజ్‌లు, నిమ్జ్‌ ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కంపెనీలతోపాటు, ఇతర భారీ పరి శ్రమల స్థాపిస్తున్నారు. ఫలితంగా మన జిల్లాలో ఉపాధి లేక పొట్టచేతపట్టుకుని అటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది.

ప్రభుత్వ విధానాలే కారణం

పరిశ్రమలు మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణం. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించేందుకు అవసరమైన విధానాలను రూపొందించకుండా నాన్చుడి ధోరణి అవలంబిస్తోంది. దీంతో పలు పరిశ్రమలు మూతపడుతున్నాయి. 

– చొక్కర రామ్మూర్తినాయుడు, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి, రాజాం

రోడ్డున పడ్డాం

స్థానిక పరిశ్రమలో పనిచేస్తుండేవాడిని. పరిశ్రమ మూతపడటంతో బండిపై పళ్లవ్యాపారం చేస్తున్నాను. దీంతో సీజన్‌లో తప్ప మరెప్పుడూ పని ఉండటం లేదు. జీవనం కష్టంగా మారుతోంది. 

– ఉత్తరావెల్లి రాము, కార్మికుడు, రాజాం

పరిశ్రమలు తెరిపించాలి

పదేళ్లలో రాజాం ప్రాంతంలో చాలా పరిశ్రమలు మూ తపడ్డాయి. ప్రస్తుతం నాలు గు జ్యూట్‌ ఫ్యాక్టరీలు మా త్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలను తెరిపిం చి కార్మికులకు ఉపాధి కల్పించాలి.    ఆనెం సత్యారావు, కార్మిక సంఘం నాయకులు, కంచరాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement