Workers problems
-
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
-
గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం?
సాక్షి, న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. గల్ఫ్ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోని వారికి సరైన జీతాలు చెల్లించకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, నకిలీ ఏజెంట్లు గల్ఫ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని, భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలివ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని చెప్పారు. దీనికి బదులిచ్చిన న్యాయవాది శ్రవణ్ కుమార్, తాను కేవలం గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నానని వివరించారు. నకిలీ ఏజెంట్ల ముఠాలు కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
నిర్మాణ కార్మికులు దొరకట్లేదు!
మియాపూర్‌లోని ఓ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కారణం, నిధుల్లేక కాదు.. లేబర్ దొరక్క! సార్వత్రిక ఎన్నికలని వెళ్లిన కార్మికులు తిరిగి రావట్లేదనేది కాంట్రాక్టర్ వాదన. పోనీ, స్థానిక లేబర్స్‌తో పనులను చక్కబెట్టేద్దామంటే? నైపుణ్య సమస్య! .. ఇది కేవలం ప్రైవేట్ డెవలపర్లే కాదండోయ్.. హౌసింగ్ ఫర్ ఆల్, కేసీఆర్ 2 బీహెచ్‌కే వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా గృహాల నిర్మాణం ఆలస్యమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులున్నారు. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. పస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. 2022 నాటికి ఈ రంగంలో 8.3 కోట్ల మంది కార్మికులు అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటూ ప్లానర్స్, ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్ వంటి అన్ని విభాగాల్లోనూ మానవ వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 70–75 వేల మంది నిర్మాణ కార్మికులుంటారు. గతంలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్లు. కానీ, ప్రభుత్వ ఉచిత పథకాల కారణంగా చాలా వరకు కార్మి కుల వలస తగ్గిపోయింది. దీంతో బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కార్మికుల ధరలివే: రోజుకు మేస్త్రీకి రూ.700–900, లేబర్ (మగవారికి) రూ.450–500, ఆడవాళ్లకు 300–350, షటరింగ్కు చ.అ.కు రూ.12–14, రాడ్ బెండింగ్ టన్నుకు రూ.6,000. ఎందుకు తగ్గిపోయారంటే? ► ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనే నిర్మాణ పనులు జరుగుతుండటంతో మెట్రో నగరాలకు కార్మికుల వలస తగ్గింది. ► సార్వత్రిక ఎన్నికల కని వెళ్లిన కార్మికులు తిరిగి పనులకు రాకపోవటం. ► కార్మికుల్లో కష్టపడే తత్వం తగ్గిపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడకపోవటం. ► వేతన అసమానతలు, కఠినమైన పని షెడ్యూల్డ్స్, ప్రసూతి సెలవులు లేకపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ► కనీస అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరుస్తుండటం. ► ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, పింఛన్లు, బీమా, ఇల్లు ప్రభుత్వమే అందిస్తుండటం. కార్మికుల కొరతతో ఏమవుతుందంటే? ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, అరకొర పనిముట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేయలేరు. ► కొనుగోలుదారులకు ఇచ్చిన గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదు. నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది. ► కార్మికులు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం కంపెనీ కార్యకలాపాల మీద పడుతుంది. అంతిమంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయి. ► కంపెనీలకు నైపుణ్యమున్న మానవ వనరుల నియామకం, శిక్షణ భారంగా మారుతుంది. టెక్నాలజీనే సరైన మందు.. నిర్మాణ పనుల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. 80 శాతం కార్మికుల కొరతను టెక్నాలజీ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు హై రైజ్ భవనాల్లో మైవాన్ టెక్నాలజీ, ప్రీ–కాస్ట్‌తో వాల్స్, కాలమ్స్, బీమ్స్ల ఏర్పాటు, రోబోటిక్స్‌తో పెయింటింగ్ వంటివి. నిర్మాణ పనుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా ముందుకురావాలి. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెవలపర్ల సంఘాలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటూ పూర్తి స్థాయి పనిముట్లను సమకూర్చాలని సూచిస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు చుక్కలే.. హై రైజ్ భవనాలు, ఒకే రకమైన గృహ సముదాయాలకు, కమర్షియల్ ప్రాజెక్ట్‌లకు మైవాన్ షటరింగ్ టెక్నాలజీ కరెక్ట్. చిన్న ప్రాజెక్ట్‌లకు ఈ టెక్నాలజీని వినియోగించలేం. ఎందుకంటే డెవలపర్లకు వ్యయం భారంగా మారుతుందని ఓ డెవ లపర్ తెలిపారు. నైపుణ్యమున్న కార్మికుల కొరత కారణంగా 100 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. 7–8 అంతస్తుల్లోపు నిర్మాణాలు చేపట్టే 85 శాతం చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు కార్మికులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్అండ్డీ అవసరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవటంతో పెద్ద ప్రాజెక్ట్‌లకు అందుబాటులో ఉన్నంత సులువుగా, సౌకర్యవంతంగా చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు అందట్లేదు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు మేనేజ్మెంట్తో పాటూ నిర్మాణ సాంకేతికత మీద కూడా పరిశోధనలు చేయాల్సిన అవసరముంది. – ఇంద్రసేనా రెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్ ప్రీ–కాస్ట్ గృహాల మీద అవగాహన కల్పించాలి ప్రధాన నగరంలో ప్రీ–కాస్ట్ తయారీ యూనిట్లను నెలకొల్పి.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఉత్పత్తులను సరఫరా చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం, డెవలపర్ల సంఘాలు ముందుకురావాలి. ప్రీ–కాస్ట్ గృహాల అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవనో లేదా నాణ్యత విషయంలోనో ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. ఇందుకోసం డెవలపర్ల సంఘాలు, ప్రభుత్వం విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలి. – సీ రామచంద్రా రెడ్డి, జనరల్ సెక్రటరీ, క్రెడాయ్ రెరా, జీఎస్టీ, బినామీ ట్రాన్స్యాక్షన్ యాక్ట్ వంటి చట్టాలతో దేశంలో రియల్టీ లావాదేవీలు పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరిగింది. దీంతో ఎన్ఆర్ఐ వ్యక్తిగత పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్, మాల్స్, గ్రేడ్–ఏ ఆఫీస్‌లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. -
బతుకులు తెల్లారెదెన్నడు!
చెన్నారావుపేట: ఎన్నో సంవత్సరాల నిరీక్షణ.. తక్కు వేతనం అని చూడకుండా నిరంతరం శ్రమ చేసేవారే జీపీ కార్మికులు.. కాని వారి బతుకులు దుర్భరంగా మారాయి. చాలీ చాలని వేతనాలతో సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో మంచి వేతనం పెరుగుతందనే కోటి ఆశలతో ఎదురుచూపులుచూస్తుంది. తెలంగాణ వచ్చాకనైనా మా బతుకులు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం, రాత్రి అనకుండా గ్రామాలలోని డ్రెయినేజీ, వీధులు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు, వీధి లైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు ఎన్నో మౌళిక వసతుల రూపలకల్పనలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కాని గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏళ్లుగా చాలిచాలని వేతనాలతో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో 265 పాత గ్రామ పంచాయతీలు ఉండగా 136 నూతన జీపీలు ఏర్పాటు కావడంతో 401కి చేరాయి. గ్రామ పంచాయితీలు.. పాత జీపీల ప్రకారంగా ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. అందులో 3 Salaries), 12 పుల్టైం వర్కర్లు(9 బిల్ కలెక్టర్లు, 03 పంప్ ఆపరేటర్,) , 58 మంది పార్ట్ టైం(16 బిల్ కలెక్టర్లు, 15 మంది పంప్ ఆపరేటర్లు, 12 స్వీపర్లు, 3 అటెండర్లు ఇతరులు 12 మంది) ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా( తాత్కాలిక ఉద్యోగులుగా బిల్ కలెక్టర్లు 99, అటెండర్లు 23, ఎలక్ట్రీసిటీ 107, పంప్ ఆపరేటర్లు 246 మంది, శానిటేషన్ స్వీపర్లు 257, ఇతరులు 96, మొత్తం 828 మంది తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నారు. చాలీచాలని వేతనం వీరికి నెలకు వేతనం రూ. 1000 నుంచి సుమారుగా రూ. 5 వేల వరకు ఇస్తున్నారు. ఇవి సక్రమంగా నెలనెలకు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎప్, ఈఎస్ఐ, ప్రభుత్వం నుంచి విడుదలైన జీవోలు, మెమోలను పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు గతంలో పంపించారని, అమలు చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2012 డిసెంబర్ 20 న జరిగిన చలో కమిషనరేట్ కార్యక్రమం చేపట్టగా దిగొచ్చిన ప్రభుత్వం వేలాది కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని యూనియన్ ప్రతినిధులతో అడిషనల్ కమిషనర్ ఒప్పుకున్నారని తెలిపారు. 2013 మే, జూన్‌లో కూడా 33 రోజులు చేసిన సమ్మెకు కూడా ప్రభుత్వం అమలు చేస్తానని హామి ఇచ్చినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐదుసంత్సరాల సర్వీస్ పూర్తయిన పంచాయతీ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం జీవో నంబర్ 3 ను అమలు చేయాలని కోరుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి 1995లో పాత మగ్దుంపుర గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషన్ వర్కర్‌గా విధుల్లో చేరాను. అప్పుడు రూ.70 వేతనం అందించారు. 15 సంవత్సరాలకు రూ. 1500 వేతనం అందిస్తున్నారు. ఇవి నెలనెలకు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీలో విద్యుత్ దీపాలు, బావి మోటర్, ఇంటి పన్నులుతో పాటు పలు రకాల పనులు చేస్తాం. పభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గర్తించి వేతనాలు పెంచాలి. నాంపెల్లి కుమార్, ఎలక్ట్రీషియన్,పాత మగ్దుంపురం కనీస వేతనం రూ. 20 వేలు అందించాలి ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులను ఆదుకుంటుంది. వారి తో పాటు గ్రామ పంచాయతీలలో చాలీ చాలనీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ. 20 వేల వేతనం ప్రభుత్వం ద్వారా అందించి ఆదుకోవాలి. జీపీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి. కూచన ప్రకాశ్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు -
జిల్లాపై సీఎం సవతి ప్రేమ
రాజాంరూరల్ : రాష్ట్రంలో అత్యధికంగా వలసలున్న జిల్లా ఏదంటే శ్రీకాకుళమే అని ఎవ్వరైనా ఠక్కున చెబుతారు. అటువంటి వెనుకబడిన మన జిల్లాపై సీఎం చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్న ఈయనకు రాజాంలో మూతపడ్డ పరిశ్రమలుగానీ, కార్మికుల దైన స్థితిగతులుగానీ పట్టకుండా పోయాయి. తన సొంత జిల్లా చిత్తూరులోని శ్రీసిటీపైనే మక్కువ చూపిస్తున్నారు. అక్కడ విస్తారంగా కంపెనీల ఏర్పాటు చేస్తూ వెనుకబడిన మన జిల్లాను విస్మరిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా రాజాంకు వస్తే పనిదొరుకుతుందనే భరోసా గతంలో ఉండే ది. పారిశ్రామిక వాడగా ప్రసిద్ధికెక్కిన ఇక్కడ గతంలో 34 వరకు చిన్నా పెద్ద పరిశ్రమలు ఉండే వి. వీటిలో 11 జ్యూట్ పరిశ్రమలు, మిగిలిన వాటిలో ఐరన్, సింథటిక్, అల్యూమిలియం, సైకిల్ రిమ్స్ అండ్ ఫోక్స్, కేబుల్ వైర్ ఇండస్డ్రీస్, పైపులు, యార్న్ పరిశ్రమలతోపాటు సిమెంటు పరిశ్రమలు ఉండేవి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి పైగా కార్మికులు పనిచేసేవారు. మూతపడిన పరిశ్రమలివే.. గతంలో వేలాది మందికి ఉపాధినిచ్చే శ్రీకాకుళం రోడ్డులో వాసవీ సిమెంట్, ఎస్కేపీ బేరింగ్స్, ఎస్ఎంఎల్ డైటెక్స్, వాసవీ పైపులు, వాసవీ రిమ్స్ అండ్ ఫోక్స్, వాసవీ స్టీల్స్, సరితా స్టీల్స్, సరితా సింథటిక్స్, కన్యా కేబుల్స్, కన్యా బోర్డ్స్ తదితర పరిశ్రమలు ప్రస్తుతం మూతపడ్డాయి. చీపురుపల్లి రోడ్డులో సీతారామ జ్యూట్ ఫ్యాక్టరీ మూతపడగా, బొబ్బిలి రోడ్డులో రాజాం అల్యూమినియం ప్రొడక్స్న్› ఫ్యాక్టరీ, పాలకొండ రోడ్డులో సరస్వతీ ప్యాకింగ్స్తోపాటు పలు ఆయిల్ మి ల్లులు మూతపడ్డాయి. దీంతో సుమారు 10వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం రాజాంలో నాలుగు జ్యూట్ ఫ్యాక్టరీలు మాత్రమే పడుతూ.. లేస్తూ పనిచేస్తున్నాయి. వీటిలో 2 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రోత్సాహం కరువు.. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండేది. ముడిసరుకు కొనుగోలుకు రుణాలు అందేవి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలు ఫ్యాక్టరీ యజమానులకు సాయం అందించేవి. కార్మికులకు కూడా పలు సంక్షేమాన్ని చూపేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. కార్మిక సంక్షేమం మూలన పడింది. ఫలి తంగా ఫ్యాక్టరీల యజమానులు చేతులెత్తేశారు. అమాంతంగా తమ వ్యాపారాలను, ఫ్యాక్టరీలను మూసేశారు. సర్కారు ఏమీ పట్టనట్లు వ్యవహరిం చడంతో కార్మికులంతా రోడ్డునపడ్డారు. పలు పర్యాయాలు ధర్నాలు, దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా రాజాంలో కార్మి కులతోపాటు ఇక్కడకు వచ్చి వెళ్లే వేలాది మంది కార్మికులు పొట్ట చేతపట్టి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది పస్తులతో కాలం నెట్టుకొస్తున్నారు. శ్రీసిటీలోనే కంపెనీలన్నీ.. చిత్తూరు – నెల్లూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేసిన శ్రీసిటీలో టీడీపీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా కంపెనీ లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ జిల్లాలు చెన్నైకు దగ్గరలో ఉన్నాయని బూచిగా చూపిస్తూ ఉత్తరాంధ్రకు రావాల్సిన కంపెనీలన్నింటినీ తరలించుకుపోతున్నారు. వాస్తవంగా చిత్తూరు తన సొంత జిల్లా కావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయించుకుంటున్నారు. అక్కడ సెజ్‌లు, నిమ్జ్ ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీలతోపాటు, ఇతర భారీ పరి శ్రమల స్థాపిస్తున్నారు. ఫలితంగా మన జిల్లాలో ఉపాధి లేక పొట్టచేతపట్టుకుని అటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వ విధానాలే కారణం పరిశ్రమలు మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణం. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించేందుకు అవసరమైన విధానాలను రూపొందించకుండా నాన్చుడి ధోరణి అవలంబిస్తోంది. దీంతో పలు పరిశ్రమలు మూతపడుతున్నాయి. – చొక్కర రామ్మూర్తినాయుడు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి, రాజాం రోడ్డున పడ్డాం స్థానిక పరిశ్రమలో పనిచేస్తుండేవాడిని. పరిశ్రమ మూతపడటంతో బండిపై పళ్లవ్యాపారం చేస్తున్నాను. దీంతో సీజన్లో తప్ప మరెప్పుడూ పని ఉండటం లేదు. జీవనం కష్టంగా మారుతోంది. – ఉత్తరావెల్లి రాము, కార్మికుడు, రాజాం పరిశ్రమలు తెరిపించాలి పదేళ్లలో రాజాం ప్రాంతంలో చాలా పరిశ్రమలు మూ తపడ్డాయి. ప్రస్తుతం నాలు గు జ్యూట్ ఫ్యాక్టరీలు మా త్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలను తెరిపిం చి కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఆనెం సత్యారావు, కార్మిక సంఘం నాయకులు, కంచరాం -
ఏజెంట్ల మోసం
మోర్తాడ్(బాల్కొండ) నిజామాబాద్ : ఏజెంట్ల మోసంతో మన కార్మికులు మలేషియాలో అవస్థలు పడుతున్నారు. ఉపాధి పొందడానికి వీసా లు ఉన్నాయని నమ్మించిన ఏజెంట్లు విజి ట్ వీసాలు చేతిలో పెట్టి అక్కడికి పంపిం చారు. గడువు ముగిసిపోవడంతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన 14 మంది మలేషియాలో ఒక గదిలో బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు. ఆర్మూర్, నిర్మల్, బాల్కొండలకు చెందిన ముగ్గురు ఏజెంట్లు వేరు వేరుగా కార్మికులను రెండు నెలల క్రితం మలేషియాకు పంపించారు. ఒక్కో కార్మికుని వద్ద రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసిన ఏజెంట్లు వర్క్ వీసా ఇస్తామని మొదట నమ్మించారు.అయితే పదిహేను రోజుల వాలిడిటీ ఉన్న విజిట్ వీసాలను ఇచ్చి మలేషియాకు పంపించారు. మలేషియాలో తమకు సం బంధించిన వ్యక్తి ఉంటాడని అతను ఎయి ర్పోర్టు నుంచి రిసీవ్ చేసుకుని పని చూపుతాడని ఏజెంట్లు చెప్పారు. మలేషియాకు చేరుకున్న తరువాత వర్క్ వీసా ఇప్పిస్తాడని నమ్మించారు. ఒక్కో కార్మికునికి రూ.35 వేల వరకు వేతనం లభిస్తుందని ఏజెంట్లు చెప్పడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసిన కార్మికులు వీసాల కోసం ఏజెంట్లు అడిగినంత చెల్లించారు. మలేషియా వెళ్లిన తరువాత కార్మికులను రిసీవ్ చేసుకున్న ఏజెంట్లకు చెందిన వ్యక్తి తనకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తేనే పని చూపుతానని డిమాండ్ చేశాడు. ఏజెంట్లకు మొత్తం డబ్బు చెల్లించిన తరువాతనే మలేషియాకు వచ్చామని మళ్లీ సొమ్ము చెల్లించడమంటే ఎలా అని కార్మికులు ప్రశ్నించా రు. తాను కోరినంత సొమ్ము ఇవ్వకపోతే పని చూపనని ఏజెంట్లకు సంబంధించిన వ్యక్తి మొరాయించడంతో కార్మికులు ఇంటి నుంచి మళ్లీ రూ.5 వేల చొప్పున సదరు వ్యక్తి ఖాతాకు సొమ్ము జమ చేయించారు. అయినప్పటికీ పలు ప్రాంతాలకు పని కోసం తిప్పిన మలేషియాలోని దళారి చివరకు పని చూపకుండానే పరారు అయ్యాడు. దీంతో కార్మికులు ఒక గదిని అద్దెకు తీసుకుని తమకు తెలిసిన వారి ద్వారా పని కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేస్తున్నా సరైన వేతనం లేదని కేవలం పొట్ట నింపుకోవడం కోసం జీతం సరిపోతుందని కార్మికులు తెలిపారు. ఇలాగైతే తాము ఎలా అప్పులు తీరుస్తామని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో మలేషియా పోలీసులు అరెస్టు చేస్తారేమోనని భయంతో బతుకుతున్నామని కార్మికులు వాపోయారు. మలేషియాలో బాధితులు వీరే... కమ్మర్పల్లి మండల చౌట్పల్లికి చెందిన వినో ద్, ఏశాల గంగన్న, వై వెంకట్, పురాణం భూమ య్య, మోర్తాడ్ మండలం ధర్మోరాకు చెందిన ఇట్టెడి ఆశన్న, గంగారాం, బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన బంగి బోజన్న, లక్ష్మణ్, జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాకకు చెందిన కమలాకర్, బొల్లి లచ్చారాం, ఆర్మూర్ మండలం పిప్రికి చెం దిన అందె నారాయణ, ఏ. సతీష్, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వకు చెందిన శ్రీరామ్ రాములు, లక్ష్మణ్‌లు మలేషియాలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమను మోసగించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుని తమను ఎలాగైనా మలే షియా నుంచి ఇంటికి రప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు. -
కార్మికులను బెదిరించడం దుర్మార్గం
గద్వాల అర్బన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయకపోగా, సమస్యల కోసం పోరాడుతున్న కార్మికులు తెల్లారేసరికి సమ్మె విరమించకపోతే ఉద్యోగాలుపోతాయని స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే డీకే.అరుణ విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే డీకే.అరుణ మద్దతు ప్రకటించి కార్మికులనుద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇచ్చినమాట ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చి కార్మికులను పర్మినెంట్ చేసే వరకు పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డంకృష్ణారెడ్డి దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజు, రఫీ, మాసుం, అనంతరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ధర్నా
నిర్మల్అర్బన్ : జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రమేశ్ డిమాండ్ చేశారు. వేతన సవరణపై యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరి, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎంయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, క్లరికల్, సూపర్వైజర్లతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెంచిన కిలోమీటర్లను తగ్గించి, తగ్గించిన ఓటిని రన్నింగ్ టైమ్‌ను పునరుద్ధరించాలన్నారు. సర్క్యులర్ ప్రకారం రూటు సర్వే చేసి, రన్నింగ్ టైమ్ ఇవ్వాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించేందకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సర్క్యులర్ 01/2018ని రద్దు చేయాలన్నారు. గ్యారేజీ కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాల ని, అధునాతన పనిముట్లు, విడిభాగాలు సరఫరా చేయాలన్నారు. తార్నాక హాస్పిటల్లో డాక్టర్లను నియమించాలని, మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్నారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కాలం చెల్లిన రెగ్యులేషన్స్ మార్చాలన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, అద్దె బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన ‘చలో బస్ భవన్’ చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘం నాయకుడు కేఎంరెడ్డి, నిర్మల్ డిపో సెక్రెటరీ గంగాధర్, నాయకులు ఆర్ఎన్ రెడ్డి, పీవీఎస్‌రెడ్డి, శేఖర్, నారాయణ, అసదుల్ల, నర్సయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వేతన వెతలు
గ్రామ పంచాయతీల కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెలనెల వేతనాలు అందక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారంపై పాలకులు అలివిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏళ్లతరబడి పోరాడి సాధించుకున్న జీవోలు సైతం అమలకు నోచుకోని దుస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వాలు.. లాఠీ దెబ్బలకు వెరవకుండ పోరాడి సాధించుకున్న జీవోలను అధికారులు కాగితాల్లోనే మగ్గబెడుతున్నారు. వాటిని అమలు చేయకుండా సంకెళ్లు వేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒంగోలు టూటౌన్: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో పారిశుద్ధ్య కార్మికులు, టైమ్‌స్కేల్ కార్మికులు, పర్మినెంట్, టెండర్, ఎన్ఎంఆర్ ఇలా ఐదు రకాల కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్, టైమ్ స్కేల్ కార్మికులు కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ (దినసరి కూలీలు) పద్ధతిలో పనిచేసే కార్మికులు దాదాపు 1000 మంది ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు 100 వరకు ఉన్నారు. వీరందరికీ పంచాయతీలకు వచ్చే ఆదాయంలో 30 శాతం నిధులను జీత, భత్యాలకు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ విధానం ఏ గ్రామ పంచాయతీలో అమలుకు నోచుకోవడం లేదు. అరకొర వేతన కార్మిక వేతన చట్టం ప్రకారం నెలకు రూ.12 వేల వరకు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా కేవలం రూ.ఆరు వేలు, కొన్ని పంచాయతీల్లో రూ.7 వేలలోపు వేతనాలు చెల్లిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ అరకొరగా ఇచ్చే వేతనాలు కూడా నెలనెలా ఇవ్వని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పొదిలి, పామూరు, సంతనూతలపాడు, దర్శి ఇలా చాలా గ్రామ పంచాయతీల్లో ఏడాది నుంచి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కొన్ని పంచాయతీల్లో మూడు నెలలు, ఆరు నెలలకు కూడా ఇవ్వడం లేదు. కొత్తపట్నం పంచాయతీలో పది మంది స్వీపర్లు వారికి 6 నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అనధికారికంగా ఒక్కో కార్మికునికి రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సంతనూతలపాడులో ఇటీవల కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేశారు. పది నెలలకుపైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 5 నెలలకు ఇచ్చి ఊరటనిచ్చారు. ఇలా నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. చిల్లర దుకాణాల్లో కూడా అప్పులు పెరిగి తిరిగి అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. అయినా అధికారులకు కార్మికుల పట్ల కనికరం లేకుండా పోతోంది. జీవో అమలులో నిర్లక్ష్యం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని 13–07–2011న (మెమో నెం.16306 /ఇ.ఎస్.టి.టి /4 /ఎ2 /2010–4), (పి.ఆర్.ఓ.సి. నెం. సి /953/2014) ప్రకారం రోజుకు రూ.300 ఇవ్వాలని ఆదేశాలు గతంలో జారీ చేశారు. జారీ చేసిన జీవో కాపీలు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా పంచాయతీ, స్థానిక పంచాయతీలకు అందాయి. దశాబ్దాలు గడిచినా నేటికీ జీవో అమలు చేసిన నాథుడు లేడు. కార్మికులు పోరాడి సాధించుకున్న ఆ జీవో కాగితాల్లోనే మగ్గుతోంది. మళ్లీ తాజాగా ఇటీవల ప్రభుత్వం 151 జీవోని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కార్మికులకు నెలకు రూ.12 వేలు వేతనం ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఈ జీవో అమలకు నోచుకోలేదు. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ హైకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. గ్రామ పంచాయతీల్లో కార్మికుల నియామకానికి నిర్వహిస్తున్న టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ల విధానం రద్దు చేస్తామని చెప్పారు. టెండర్ల రద్దు చిత్తూరు జిల్లాలో అమలకు నోచుకుంది. మన జిల్లాలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కలగానే 010 పద్దు జీతాలు పర్మినెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జాయింట్ కలెక్టర్ అధ్యక్షుడిగా, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీవోతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పర్మినెంట్ కార్మికులను గుర్తించి వివరాలు పంపిస్తే ప్రభుత్వం ఖజానా శాఖ ద్వారా జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. పర్మినెంట్ కార్మికులు ఉన్న పంచాయతీలకు ఆర్థిక భారం తగ్గుతుంది. మిగిలిన పార్ట్‌టైం, ఎన్ఎంఆర్ పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీలు వేతనాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో పర్మినెంట్ కార్మికులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకు సిద్ధం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఆందోళన చెపడుతున్నట్లు సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు మజూందర్ తెలిపారు. టెండర్ల విధానం రద్దు చేయాలని, నెలనెలా కార్మికులకు జీతాలు ఇవ్వాలని, 151 జీవో ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మజుందార్ పేర్కొన్నారు. -
'కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా'
రంగారెడ్డిజిల్లా: కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన జీవిత లక్ష్యమని ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జీవీఎస్ఆర్ నగర్లో హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ, ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వి. భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంజీవ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్విన్ కార్మికులు సంజీవ్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్విన్కార్మికులు సత్ ప్రవర్తనతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకొని కార్మికులందరికి మార్గదర్శకం కావాలన్నారు. కార్మికులు సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతానని ఆయన పేర్కొన్నారు. -
సింగరేణికి తాగునీటి గండం.. ?
సింగరేణికి భవిష్యత్‌లో తాగునీటి గండం ఏర్పడేలా ఉంది. గోదావరి నది చెంతనే ఉన్నా కార్మికుల కష్టాలు తప్పేలా లేవు. ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీరు పొందే వీలున్నా పైప్లైన్ల ఏర్పాటుకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ప్రత్యామ్నాయంగా కార్మికులకు గనుల్లో ఊట నీటిని తాగించాలని ఆలోచన చేస్తోంది. ఇదే నిజమైతే భవిష్యత్‌లో కోల్‌బెల్ట్ ప్రాంత వాసులు గోదావరినది నీటిని తాగే అదృష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది. గోదావరిఖని : సింగరేణికి రామగుండం రీజియన్ పరిధిలో ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 డివిజన్లు ఉన్నాయి. ఎనిమిది భూగర్భ గనులు, నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కోసం గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలలో క్వార్టర్లు నిర్మించారు. సింగరేణి కార్మికులు, వారి పిల్లలు కూడా ప్రైవేటుగా నిర్మించుకున్న ఇళ్లల్లో నివసిస్తున్నారు. దాదాపుగా 35 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీరికి గోదావరినది ఒడ్డున నిర్మించి న పంప్‌హౌస్ ద్వారా తాగునీటిని శుద్ధి చేసి 22 కిలోమీటర్ల దూరం గల సెంటినరీకాలనీ వరకు నీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు. చాలా ఏళ్లుగా సరైన వర్షాలు లేక గోదావరినది ఎండిపోతుండడంతో సింగరేణి యాజ మాన్యం నదిలో బోర్లను వేసి నీటి కొరత తీర్చుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద గోదావరినదిపై ప్రాజెక్టును నిర్మించడంతో నీటి ప్రవాహం ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో దిగువన ఉన్న పట్టణాల నీటి కష్టాలు తీర్చేందేకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు ఒక టీఎంసీ కేటాయించగా, వారు పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పొందుతున్నారు. రామగుండం కార్పొరేషన్‌కు ఒక టీఎంసీ, సింగరేణికి మరో టీఎంసీ కేటాయించారు. తడిసి మోపెడవుతున్న పైప్లైన్ల ఖర్చు.. సింగరేణికి కేటాయించిన ఒక టీఎంసీ నీటిని పొందాలంటే ఎల్లంపల్లి నుంచి పైప్లైన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 15 కిలోమీటర్ల దూరం గల ఈ పైప్‌లైన్‌కు సుమారు రూ. 200 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసేం దుకు యాజమాన్యం వెనుకంజ వేస్తున్నట్లు సమాచా రం. ఈ క్రమంలో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వర్షాలు కురిస్తే నదిలో ఎల్లప్పుడూ నీరుంటుందని, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే నదిలో బోర్లు వేసుకోవచ్చని, అది కూడా సాధ్యం కాకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ని వదలాలని కోరడంపై ఆలోచన చేస్తోంది. అలాగే గోదావరినది ఒడ్డున ఉన్న మేడిపల్లి ఓసీపీ జీవిత కాలం మరో ఆరేళ్లు మాత్రమే ఉంది. అక్కడ బొగ్గు నిల్వలు వెలికితీసిన తర్వాత ఏర్పడిన గొయ్యిలో వర్షా కాలంలో నదిలో వచ్చే వరద నీటిని నింపాలనే ఆలోచనతో యాజమాన్యం ఉంది. అలాగే జీడీకే 5వ గని, జీడీకే 11వ గనిలో ఊటగా వచ్చే నీటిని శుద్ధి చేసి తాగునీటిగా వాడుకోవచ్చనే దిశగా యాజమాన్యం ఆలోచి స్తోంది. కానీ గనుల్లో నీటిని ఎంత శుద్ధి చేసినా దానిలో పీపీఎం శాతం ఎక్కువగా ఉంటోంది. గతంలో యాజ మాన్యం ఈ నీటిని కార్మిక కాలనీలకు సరఫరా చేసినా వారు తాగకుండా గోదావరినీటిపైనే ఆధారపడ్డారు. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలపై ఆలోచించకుండా ఎల్లంపల్లి నుంచి టీఎంసీ నీటిని పొందేలా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. -
రెక్కలు ముక్కలు
* రాష్ట్రంలో 1.40 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే * ఏపీఈఆర్పీ పర్యవసానం * బాబు పాలనలో కార్మికద్రోహం * బిల్డింగ్ వెల్ఫేర్ ఫండ్’ నుంచి రూ.400 కోట్లు మళ్లించి * నిర్మాణ కార్మికుల నోట మట్టికొట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి జన పథం: 1.40 కోట్ల మంది...ఎవరంటారా..? రాష్ర్టంలోని అసంఘటిత కార్మికులు.. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, డీఏ, పింఛను, గ్రాట్యుటీ....అబ్బే! అంతెందుకు...వారికి కనీస వేతనాలే ఉండవు. ఎందుకంటే వారు సర్కారు నిర్లక్ష్యానికి ‘బండ’బారిన బతుకులను మొండిగా ఈడుస్తున్నవారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ భద్రత లేని శ్రమ చేస్తుంటారు. ఏ సంస్థలోనైనా కాజువల్ కార్మికులది వేదనే. కనీస వే తనాలను ఎగవేయడం, ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐలు ఇవ్వాలని టెండర్లో ఉన్నా వారికి ఆ సదుపాయాలు కల్పించకపోవడం ఆనవాయితీగా మారింది. ఈ దుస్థితికి జీవో 16 రూపంలో చంద్రబాబు పాలనలోనే బీజం పడింది. వీరంతా ఓట్ల రూపంలో సంఘటితమైతే తమను నిర్లక్ష్యం చేసిన నేతల భవితవ్యాన్ని నిర్దేశించగలరు. బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పెరగడానికి, టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలకు అవినాభావ సంబంధం ఉంది. 1995లో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు అప్పుతో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణ ప్రాజెక్టు (ఏపీఈఆర్పీ) పర్యవసానంగా ప్రభుత్వ రంగంలో తాత్కాలి క కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు పెరిగి పోయారు. ఎంతగా అంటే...దేశంలో అసం ఘటిత రంగ కార్మికులు అత్యధిక మంది ఉన్న రాష్ట్రాల్లో మనం మూడో స్థానంలో ఉన్నాం. దేశంలోని అసంఘటిత రంగ కార్మికుల్లో 10 శాతం మన రాష్ట్రంలోనే ఉన్నారు. నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది... రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతినిపోవడంతో లక్షలాదిగా రైతులు, రైతు కూలీలు నిర్మాణ రంగంలో కార్మికులుగా మారిపోయారు. ఇంత పెద్ద ఎత్తున కార్మికులు ఉండడంతో వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా బిల్డింగ్ వెల్పేర్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో రూ. 1250 కోట్లు ఉన్నాయి. ఏడు నెలల క్రితం ఇందులోని రూ. 400 కోట్లకుపైగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇతరత్రా బదలాయించారు. భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని పరిష్కరించలేదు. బీడీ కార్మికులు 8 లక్షలు.... రాష్ట్రంలో బీడీ వర్కర్లు 8 లక్షల మంది ఉంటారు. అందులో 6 లక్షల మంది ఉత్తర తెలంగాణలోనే ఉంటారు. దాదాపు 30 నియోజవర్గాల్లో వీరు ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. 20 లక్షల మంది హమాలీలు ఉన్నారు. 5 లక్షల మంది ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఐకేపీలో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. భద్రత కరువు... భవిష్యత్తు బరువు అసంఘటిత కార్మికులు ప్రధానంగా పట్టణాల్లో కేంద్రీకరించి ఉంటున్నారు. ఆదా యం తక్కువ కావడంతో వీరు మురికివాడల్లో నివసిస్తున్నారు. వారికి రేషన్‌కార్డులు, ఇళ్లపట్టాలు, మంచినీరు వంటి పౌరసేవలు అందవు. * సిమెంటు, స్టీల్ ధరల పెరగడంతో నిర్మాణ కార్మికులకు పని తగ్గింది. * కరెంటు కోతలతో చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. * రైసు మిల్లులు ఆడకపోవడంతో హమాలీలకు పనులు దొరకడంలేదు. * ఆకు, తంబాకు సరఫరా లేక బీడీ కార్మికుల పనిదినాలు కోతపడ్డాయి. * లేసుతో అల్లిన టోపీలు తయారు చేసేవారు పశ్చిమ గోదావరి జిల్లాలో 19 మండలాలు, తూర్పులోని కోనసీమ ప్రాంతంలో కలిపి లక్ష మంది ఉన్నారు. అందరూ మహిళలే. * బీడీ కార్మికులు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 8 లక్షల మంది ఉన్నారు. వీరికి పీఎఫ్ కవరేజీ లేదు. * ఈ సేవా కేంద్రాలు షెడ్యూల్ పరిశ్రమల జాబితాలో లేకపోవడం వల్ల అందులో పనిచేసేవారు కనీస వేతనాలకు నోచుకోవడంలేదు. * షెడ్యూల్ లిస్టులో ఉండి ఎప్పటికప్పుడు కనీస వేతనాలు నిర్ణయించే జీడిపప్పు తయారీ, ఆక్వా పరిశ్రమ మొదలైన వాటిల్లో వేలాది మంది పనిచేస్తున్నా అక్కడా కనీస వేతనాలు అమలు లేదు. వాటిలో పనిచేసే వేలాది మంది మహిళలు, పిల్లలకు చేతులు కాలినా జీడిరసం పడి మొహాలు, చేతులపై బొబ్బలొచ్చినా ఏ పరిహారం ఇవ్వరు. * కార్మికుల నష్టపరిహార చట్టం ప్రకారం పనిచేసే చోట ప్రమాదవశాత్తూ చనిపోయినా, అంగవైకల్యం ప్రాప్తించినా కార్మికుడి వయస్సు, ఇంకా ఎన్నేళ్లు ఆ పని చేయగలుగుతాడో నిర్ణయించి అప్పటికి అతనికి రావాల్సిన వేతనంపై ఆధారపడి నష్టపరిహారం లెక్కిస్తారు. కానీ ఇవేవి అమలు కావడంలేదు. జీవో 16/1995 శాపం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనాలు అందకపోవడానికి టీడీపీ తీసుకొచ్చిన జీవోనే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు అంటున్నారు. 50 పాయింట్స్ వినిమయ ధరల సూచి పెరిగినా... 2 ఏళ్లు పూర్తయినా కనీస వేత నాలు నిర్ణయించాలని 60వ దశకంలో అఖిల భారత కార్మిక మంత్రుల సమావేశం తీర్మాని ంచింది. అయితే 1995లో టీడీపీ ప్రభుత్వం దీన్ని సవరిస్తూ జీవో 16 విడుదల చేసింది. డీఏ ఇస్తున్నాం కాబట్టి ఐదేళ్లకోసారి కనీస వేతనాల పునర్నిర్ణయం చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అసంఘటిత కార్మికుల పాలిట శాపంగా మారింది. కనీస వేతనాలు కరువు సింగరేణి సంస్థలో సుమారు 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 9వ వేతన ఒప్పందం సందర్భంగా హైపవర్ కమిటీ నిర్ణయించిన మేరకు అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ. 460, సెమీస్కిల్డ్ కార్మికులకు రూ. 494, స్కిల్డ్ కార్మికులకు రూ. 524, హై స్కిల్డ్ కార్మికులకు రూ. 554 ఇవ్వాలి. కానీ అమలు జరగడం లేదు. - కె.విశ్వనాథ్, అధ్యక్షుడు, ఎస్సీసీడబ్ల్యూ యూనియన్, గోదావరిఖని నాటి పాలకుల పుణ్యమే... చింతల్ హెచ్‌యంటీ ల్యాంప్ డివిజన్లో 2500 మందికి పైగా కార్మికులు పని చేస్తుండేవారు. 1996 నుంచి పతనం ప్రారంభమై 2002 కల్లా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ప్రభుత్వం పట్టించుకుంటే ఉత్పత్తులు కొనసాగిస్తున్న హెచ్యంటిని కాపాడుకునేవాళ్లం. వేల మంది ఉసురు అప్పటి ప్రభుత్వానికి తగులుతుంది. కార్మికులకు అండగా ఉండేవారికే మా ఓటు. - అశోక్, హెచ్‌యంటీ ల్యాంప్ డివిజన్ మాజీ కార్మికుడు, కుత్బుల్లాపూర్ ప్రైవేటుకు కొమ్ముకాశారు.. తొమ్మిది వేల మంది కార్మికులు ఉన్న ఐడీపీఎల్‌ను 1994 నుంచి 2004 మధ్య మూసివేసే దిశకు తీసుకొచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమలకు కొమ్ముకాయడం వల్ల ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన టీడీపీ కార్మిక ద్రోహం చేసింది. - జల్దా రాఘవులు, ఐడీపీఎల్ మాజీ కార్మికుడు, గాంధీనగర్