బతుకులు తెల్లారెదెన్నడు! | Grama Panchayat Workers Problems With Salaries | Sakshi
Sakshi News home page

బతుకులు తెల్లారెదెన్నడు!

Published Wed, Apr 17 2019 11:53 AM | Last Updated on Wed, Apr 17 2019 11:53 AM

Grama Panchayat Workers Problems With Salaries - Sakshi

చెన్నారావుపేట: ఎన్నో సంవత్సరాల నిరీక్షణ.. తక్కు వేతనం అని చూడకుండా నిరంతరం శ్రమ చేసేవారే జీపీ కార్మికులు.. కాని వారి బతుకులు దుర్భరంగా మారాయి. చాలీ చాలని వేతనాలతో సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో మంచి వేతనం పెరుగుతందనే కోటి ఆశలతో ఎదురుచూపులుచూస్తుంది. తెలంగాణ వచ్చాకనైనా మా బతుకులు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం, రాత్రి అనకుండా గ్రామాలలోని డ్రెయినేజీ, వీధులు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు, వీధి లైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు ఎన్నో మౌళిక వసతుల రూపలకల్పనలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైంది.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారు. కాని గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏళ్లుగా చాలిచాలని వేతనాలతో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో 265 పాత గ్రామ పంచాయతీలు ఉండగా 136 నూతన జీపీలు ఏర్పాటు కావడంతో 401కి చేరాయి. గ్రామ పంచాయితీలు.. పాత జీపీల ప్రకారంగా ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి.

అందులో 3 Salaries), 12 పుల్‌టైం వర్కర్లు(9 బిల్‌ కలెక్టర్‌లు, 03 పంప్‌ ఆపరేటర్,) , 58 మంది పార్ట్‌ టైం(16 బిల్‌ కలెక్టర్‌లు, 15 మంది పంప్‌ ఆపరేటర్‌లు, 12 స్వీపర్లు, 3 అటెండర్‌లు ఇతరులు 12 మంది) ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా( తాత్కాలిక ఉద్యోగులుగా బిల్‌ కలెక్టర్‌లు 99, అటెండర్లు 23, ఎలక్ట్రీసిటీ 107, పంప్‌ ఆపరేటర్లు 246 మంది, శానిటేషన్‌ స్వీపర్‌లు 257, ఇతరులు 96, మొత్తం 828 మంది తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నారు.
 
చాలీచాలని వేతనం
వీరికి నెలకు వేతనం రూ. 1000 నుంచి సుమారుగా రూ. 5 వేల వరకు ఇస్తున్నారు. ఇవి సక్రమంగా నెలనెలకు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎప్, ఈఎస్‌ఐ, ప్రభుత్వం నుంచి విడుదలైన జీవోలు, మెమోలను పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్‌ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు గతంలో పంపించారని, అమలు చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2012 డిసెంబర్‌ 20 న జరిగిన చలో కమిషనరేట్‌ కార్యక్రమం చేపట్టగా దిగొచ్చిన ప్రభుత్వం వేలాది కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని యూనియన్‌ ప్రతినిధులతో అడిషనల్‌ కమిషనర్‌ ఒప్పుకున్నారని తెలిపారు. 2013 మే, జూన్‌లో కూడా 33 రోజులు చేసిన సమ్మెకు కూడా ప్రభుత్వం అమలు చేస్తానని హామి ఇచ్చినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐదుసంత్సరాల సర్వీస్‌ పూర్తయిన పంచాయతీ కార్మికులను పర్మనెంట్‌ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం జీవో నంబర్‌ 3 ను అమలు చేయాలని కోరుతున్నారు. 

పర్మనెంట్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
1995లో పాత మగ్దుంపుర గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషన్‌ వర్కర్‌గా విధుల్లో చేరాను. అప్పుడు రూ.70 వేతనం అందించారు. 15 సంవత్సరాలకు రూ. 1500 వేతనం అందిస్తున్నారు. ఇవి నెలనెలకు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీలో విద్యుత్‌ దీపాలు, బావి మోటర్, ఇంటి పన్నులుతో పాటు పలు రకాల పనులు చేస్తాం. పభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గర్తించి వేతనాలు పెంచాలి.  నాంపెల్లి కుమార్, ఎలక్ట్రీషియన్,పాత మగ్దుంపురం

కనీస వేతనం రూ. 20 వేలు అందించాలి
ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులను ఆదుకుంటుంది. వారి తో పాటు గ్రామ పంచాయతీలలో చాలీ చాలనీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ. 20 వేల వేతనం ప్రభుత్వం ద్వారా అందించి ఆదుకోవాలి.   జీపీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి. 
కూచన ప్రకాశ్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement