'కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా' | be like a role model to all other employes says sanjeeva reddy with alwyn employes | Sakshi
Sakshi News home page

'కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా'

Published Mon, Jan 26 2015 4:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

be like a role model to all other employes says sanjeeva reddy with alwyn employes

రంగారెడ్డిజిల్లా:  కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన జీవిత లక్ష్యమని ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జీవీఎస్‌ఆర్ నగర్‌లో హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వి. భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సంజీవ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఐఎన్‌టీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్విన్ కార్మికులు సంజీవ్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్విన్‌కార్మికులు సత్ ప్రవర్తనతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకొని కార్మికులందరికి మార్గదర్శకం కావాలన్నారు. కార్మికులు సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతానని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement