ఎస్‌ఎఫ్‌ఐ నేత పరిస్థితి విషమం | sfi leader's situation is serious | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎఫ్‌ఐ నేత పరిస్థితి విషమం

Published Sat, Feb 7 2015 7:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

sfi leader's situation is serious

అనంతపురం: అనంతపురం పట్టణంలో శనివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరేశ్ తలకు బలమైన గాయాలయ్యాయి. నరేశ్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ బైక్‌పై పట్టణంలోని తాడిపత్రి బస్టాండ్ నుంచి శ్రీకంఠం సర్కిల్ వైపు వెళుతుండగా పాత కృష్ణా థియోటర్ సమీపంలోకి రాగానే వారి వాహనాన్ని ఎదురుగా వచ్చిన అపాచీ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్ తలకు బలమైన గాయాలవగా, కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... నరేశ్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రకటించారు. పరిస్థితి విషమంగా ఉందని, బెంగళూరుకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement