షర్మిల బస్ యాత్ర వివరాల వెల్లడి | Sharmila Bus Tour Details | Sakshi
Sakshi News home page

షర్మిల బస్ యాత్ర వివరాల వెల్లడి

Published Sat, Aug 31 2013 8:10 PM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

షర్మిల ఫైల్ ఫొటో

షర్మిల ఫైల్ ఫొటో

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల బస్సు యాత్ర వివరాలను ఆ పార్టీ నేతలు  తలశిల రఘురాం, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విడుదల చేశారు. ఆమె నాలుగు జిల్లాల్లో బస్సుయాత్ర చేస్తారు. సెప్టెంబరు 2వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల నివాళులర్పిస్తారు.   సాయంత్రం 4 గంటలకు ఆమె తిరుపతి వెళతారు. తిరుపతి లీలామహల్‌ సెంటర్‌ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి ఆమె తిరుపతిలో బసచేస్తారు. 3వ తేదీ  ఉదయం చిత్తూరులో, సాయంత్రం మదనపల్లిలో జరిగే బహిరంగ సభలలో ప్రసంగిస్తారు.

4వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా కదిరిలో, సాయంత్రం అనంతపురంలో పర్యటిస్తారు. 5 ఉదయం కర్నూలు జిల్లా డోన్లో, సాయంత్రం కర్నూలు టౌన్‌లో పర్యటిస్తారు. 6 ఉదయం నంద్యాలలో, సాయంత్రం ఆళ్లగడ్డలో పర్యటిస్తారు. 7న ఉదయం వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో, సాయంత్రం బద్వేలులో పర్యటిస్తారు.

ఇదిలా ఉండగా,  వైఎస్‌ఆర్ సీపీ నేతలు భూమన కరుణాకర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి  తిరుపతిలో జరిగే బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిల బస్సుయాత్ర సమైక్యవాదులకు మరింత బలాన్నిస్తుందన్నారు.

Advertisement

పోల్

Advertisement