పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : పాలకొల్లు మండలం అచ్చుగట్లపాలెంలోని చిత్రాది చెరువుగట్టు మీద కొలువైన ముఖధారమ్మ అమ్మవారికి 30 కేజీల వెండితో చీరను తయారు చేయించారు. శనివారం గ్రామంలో అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఉగాది రోజున అమ్మవారిని వెండిచీరతో అలంకరిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వెండి చీరను భక్తులు సమర్పించిన విరాళాలతో చేయించారు.