అంటువ్యాధుల విజృంభణ
Published Sun, Dec 15 2013 4:30 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
పిఠాపురం, న్యూస్‌లైన్ :పిఠాపురం మున్సిపాలిటీ పరిధి లోని అనేక ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రతి వార్డులోను సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని ఏడు కాలువల్లో ఎక్కడ చూసినా రోగులే కనిపిస్తున్నారు. ఈ గ్రామంలో 150 మందికి పైగా రోగాలతో సతమతమవుతున్నారు. చికున్‌గున్యా, టైఫాయిడ్, మలేరియా, డెం గీ, కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, జ్వరా లు, వాంతులు, విరేచనాలు విజృంభించినట్టు గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. పారిశుధ్యం లోపించడంతో పాటు తాగునీరు కలుషితమవడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ప్రతి గ్రామంలోను అనేక కుటుంబాలు అనారోగ్యంతో మంచం పట్టడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పిఠాపురం మున్సిపాలిటీలోని ఏడుకాలువల్లో వారం రోజుల నుంచి వ్యాధులు ప్రబలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది పారిశుధ్య పనులు వేగవంతం చేసినా, వైద్య శిబిరం ఏర్పాటు చేసినా వ్యాధులు తగ్గుముఖం పట్టకపోగా, రోజురోజుకూ పెరుగుతున్నాయి. పిఠాపురం ప్రభుత్వాస్పత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద అధిక సంఖ్యలో రోగులు పడిగాపులు పడుతున్నారు. వారం రోజులుగా అంటువ్యాధుల బారినపడినా తమను పట్టించుకోవడం లేదని పిఠాపురం మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. రోగుల ముఖంపై నల్లని మచ్చలు రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వ రాలు తగ్గుతూ, మళ్లీ వస్తూ, కీళ్లనొ ప్పులు వారాల తరబడి పీడిస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. వైద్యాధికారులు చర్యలు తీసుకుని, పూర్తి స్థాయిలో అంటురోగాల నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement