
సాక్షి, ప్రకాశం: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య లహరి అత్తమామలు, ఆడపడుచులను ప్రకాశం జిల్లాలో శంషాబాద్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26 శంషాబాద్ పరిధిలోని రాళ్లపల్లిలో భర్త వేధింపులు భరించలేక లావణ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా..
అప్పటి నుంచి లావణ్య భర్త, అత్తమామలు, ఆడపడుచులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో భర్త వెంకటేష్, అత్తమామలు సుబ్బారావు, రమాదేవితో పాటు ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీ కుమారిలపై కేసు నమోదు అయ్యింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడం కోసం శంషాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వరిమడుగు గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు. (వీడియో: పైలట్ మొగుడి పైశాచికం!)
Comments
Please login to add a commentAdd a comment