
భారత్ వృద్ధి బాట పటిష్టమే: ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు పటిష్టంగానే ఉన్నట్లు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అవుట్‌టుక్ (ఏడీఓ) 2016 నివేదిక పేర్కొంది. తగిన డిమాండ్, సంస్కరణలే భారత్ వృద్ధికి కీలకమని అధ్యయన నివేదిక వివరించింది. 2016లో దేశం 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. వ్యవస్థాగత సంస్కరణలు, పటిష్టంగా ఉన్న వినియోగ డిమాండ్, తగిన వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయ గణాంకాల వృద్ధికి అవకాశాలు వంటివి భారత్ పటిష్ట వృద్ధి బాట అంచనాలకు కారణంగా వివరించింది.