సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
శ్రీకాకుళం అర్బన్:రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్ అండ్ పంచాయతీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణారావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ పంచాయతీ యూనియన్స్ జిల్లా మహాసభ ఆదివా రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల ముం దు, ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సమ్మెలోకి వెళతామన్నారు. ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఈ విధమైన పనులు మున్సిపాలిటీలో చేస్తున్నవారు ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, పార్కు మజ్దూర్, ఎలక్ట్రికల్ సెక్యూరిటీగార్డ్, డ్రైవర్స్, ట్రైసైకిల్స్, పాఠశాలలో స్వీపర్స్, శానిటరీ కార్మికులు, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులు దాదా పు 35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు.
వీరిని తక్షణమే క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వం పదవ పీఆర్‌సీ సిఫార్సులను అమలు చేయాలని, ప్రతి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15 వేలుకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ బలహీన వర్గాల కోటాలో పక్కా గృహాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు, పీఎఫ్ వంటివి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర సుందరలాల్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు చిక్కాల గోవిందరావు, గురుగుబెల్లి అప్పలనాయుడు, మున్సిపల్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఐతం గౌరీశంకర్, జట్టుకళాశీ యూనియన్ అధ్యక్షుడు నక్కవేణు, సైకిల్‌షాపు వర్కర్స్ యూనియన్ ప్రతినిధి టేకు గోవిందరావు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
సమావేశం అనంతరం మున్సిపల్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షునిగా గురుగుబెల్లి అప్పలనాయుడు, అధ్యక్షునిగా రౌతు సింహాచలం, ఉపాధ్యక్షులుగా బొమ్మాళి రాంప్రసాద్, ఎం.పార్వతి, ప్రధాన కార్యదర్శిగా లఖినేని వేణు, వర్కింగ్ సెక్రటరీగా చిక్కాల గోవిందరావు, కార్యదర్శిగా ఈగల వెంకటరావు, సహాయ కార్యదర్శిలుగా కె.వి.ఈ సత్యనారాయణ, కోశాధికారిగా పల్లా హరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.