ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
- నిరసన శిబిరంలో రఘువీరా
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో ఊరూవాడా ఉద్యమిస్తామన్నారు. ‘ఈ నెల 13 వరకు వేచి చూస్తాం. టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రత్యేక హోదా సాధించుకు రాకుంటే కాంగ్రెస్ పక్షాన ఆందోళనలు ముమ్మరం చేస్తాం’ అని రఘువీరా హెచ్చరించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరులో పార్టీ నేతలందరూ సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.
మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన దీక్షా శిబిరంలో రఘువీరా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. బీజేపీతో లాలూచీ పడి రాజకీయ వ్యాపారం చేస్తోందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.