APCC raghuveera reddy
-
అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తన రాజీనామాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాననన్నారు. తన రాజీనామా లేఖను మే 19వ తేదీనే కాంగ్రెస్ అధిష్టానానికి పంపించినట్లు చెప్పారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. -
‘ఎంపీ టికెట్ అడిగితే చితకబాదారు’
సాక్షి, సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తనపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడని ఆ పార్టీ నేత, అడ్వకేట్ సుంకర కృష్ణమూర్తి శుక్రవారం విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1972 నుంచి తాను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నానని, గతంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయానని అన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో రఘువీరాను కలిసి విజయవాడ పార్లమెంట్ టికెట్‌ను తనకు గాని, సుంకర పద్మశ్రీకి గాని కేటాయించాలని కోరానన్నారు. అందుకు రఘువీరా, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజా, అధికార ప్రతినిధి కిరణ్, ఆఫీస్‌బాయ్ గౌస్, మరో పది మందితో తనపై దాడి చేయించి పిడిగుద్దులు గుద్ది మెడపట్టుకుని బయటకు తోసేశారన్నారు. తనను చంపడానికి ప్రయత్నించిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘సీటు అడిగితే చితకబాదారు’
-
భజనపరులు మాత్రమే టీఆర్ఎస్ వైపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు భజన పరులు మాత్రమే టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. కూటమిని గెలిపించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో రఘువీరాతో పాటు పలువురు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం రఘువీరా మాట్లాడారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో ద్వేషం, అసహ్యం నెలకొందని విమర్శించారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి 15 కోట్లకు పైగా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వాహనాలు, 108 వాహానాల్లో డబ్బులు తరలిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని చూస్తే టీఆర్ఎస్కు వణుకు పుడుతుందని అందుకే బరితెగించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రేవంత్‌ను అరెస్ట్ చేయడంతో టీఆర్ఎస్ ఓటమి ఖరారయిందని జోస్యం చెప్పారు. అరెస్టు చేసిన అధికారులపై వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో మార్చి చివరకు కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారని ఎద్దేవ చేశారు. కారుకు ఓటేస్తే కమలంకు ఓటేసినట్లేనని విమర్శించారు. -
అవి సర్కారీ హత్యలే: రఘువీరా
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన హత్య అయితేనేమీ, కిష్టపాడు సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన హత్య తీరు పరిశీలిస్తే అవి వంద శాతం సర్కారీ హత్యలే అని స్పష్టమవుతోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో హత్యల పరంపర చూస్తుంటే ప్రభుత్వమే లెసైన్స్ ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో హత్య జరిగిన తరువాత చాలా సమయానికి కార్యాలయానికి నిప్పు పెట్టడంలోనూ అనుమానాలకు తావిస్తోందన్నారు. బుధవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
నిరసన శిబిరంలో రఘువీరా సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పునరుద్ఘాటించారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో ఊరూవాడా ఉద్యమిస్తామన్నారు. ‘ఈ నెల 13 వరకు వేచి చూస్తాం. టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రత్యేక హోదా సాధించుకు రాకుంటే కాంగ్రెస్ పక్షాన ఆందోళనలు ముమ్మరం చేస్తాం’ అని రఘువీరా హెచ్చరించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరులో పార్టీ నేతలందరూ సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన దీక్షా శిబిరంలో రఘువీరా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. బీజేపీతో లాలూచీ పడి రాజకీయ వ్యాపారం చేస్తోందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.