
అవి సర్కారీ హత్యలే: రఘువీరా
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన హత్య అయితేనేమీ, కిష్టపాడు సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన హత్య తీరు పరిశీలిస్తే అవి వంద శాతం సర్కారీ హత్యలే అని స్పష్టమవుతోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో హత్యల పరంపర చూస్తుంటే ప్రభుత్వమే లెసైన్స్ ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో హత్య జరిగిన తరువాత చాలా సమయానికి కార్యాలయానికి నిప్పు పెట్టడంలోనూ అనుమానాలకు తావిస్తోందన్నారు. బుధవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.