
సాక్షి, తిరుమల: శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తిరుమలలోని శ్రీ వెకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. రాజపక్సేకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రధాని రాజపక్సే ప్రత్యేక పూజాలు నిర్వహించారు. రాజపక్సేకు పూజారులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక ప్రధాని రాజపక్సే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment