టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మండిపాటు
తిరుమల: నాణ్యతకు మారుపేరుగా ఉండే శ్రీవారి లడ్డూ ప్రస్తుతం నాణ్యత, లడ్డూకు ఉండే ప్రత్యేక తగ్గిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మండిపడ్డారు. సోమవారం రాత్రి ఆయన లడ్డూ కౌంటర్లు పరిశీలించారు. లడ్డూ నాణ్యత, వితరణ పద్ధతులు పరిశీలించారు. లడ్డూలు నాణ్యత తగ్గిందని, గతంలో మాదిరిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదన్నారు.
భక్తులకు ఇచ్చే లడ్డూ కూడా టీటీడీ నిబంధనల ప్రకారం 175 గ్రాములు ఉండటం లేదనే ఫిర్యాదులు భక్తులనుండి పెరిగాయన్నారు. భక్తులకు నాణ్యత, పరిమాణంతో కూడిన లడ్డూ అందించేందుకు కృషి చేస్తామన్నారు. లడ్డూ కౌంటర్లు నిర్వహించే సిబ్బందికి ఆయా బ్యాంకులు తక్కువ జీతాలు ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థి ఉందన్నారు. శ్రీవారి సేవకులతో నిర్వహించే కౌంటర్లు ఫిర్యాదులు తగ్గాయన్నారు.
శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గింది
Published Tue, Oct 13 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement