Srivari brownies
-
తిరుమల శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
-
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
న్యూఢిల్లీ: విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ), కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(టీటీడీ) ప్రశ్నించింది. తిరుమల ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించడానికి, శ్రీవారి ఆభరణాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) ఆదేశించింది. ఈ మేరకు సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. కారణం లేకుండానే వెయ్యి కాళ్ల మండపం కూల్చేశారు తిరుమల ఆలయాలను చరిత్రాత్మక, జాతీయ వారసత్వ కట్టడాలుగా ప్రకటించడానికి తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ అనే వ్యక్తి తొలుత ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. తిరుమల ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1,500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంరక్షించడం లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాల భద్రతపైనా అయ్యంగార్ అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుమల కొండపై శ్రీవారి ప్రధాన ఆలయం మహాద్వారం ఎదురుగా ఉన్న 15 శతాబ్దం నాటి వెయ్యి కాళ్ల మండపాన్ని ఎలాంటి కారణం లేకుండానే 2003లో కూల్చివేశారని ఆక్షేపించారు. తేలిగ్గా తీసుకోవద్దు... తిరుమల కొండపై ఉన్న ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించి ఉంటే, వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసే సాహసం చేసేవారు కాదని మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయాలు, ఆభరణాల పరిరక్షణ విషయంలో జస్టిస్ వాద్వా, జస్టిస్ జగన్నాథరావు కమిటీలు ఇచ్చిన నివేదికలను ఇప్పటిదాకా ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీటీడీని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే వినతులకు టీటీడీ పాలక మండలి గతంలో స్పందించేదని, ఇప్పుడు సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తోందని చెప్పారు. ‘‘ఫిర్యాదిదారుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రధానమంత్రి కార్యాలయం తేలిగ్గా తీసుకోరాదు. ప్రాచీన కట్టడాలను కాపాడే విషయంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియాలాజికల్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. భారతదేశ ప్రాచీన సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే తిరుమల ఆలయాలు, కట్టడాలు, అప్పటి విలువైన ఆభరణాలను కాపాడడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. టీటీడీ పాలక మండలిలో తిష్టవేసిన రాజకీయ నాయకులకే ఈ అంశాన్ని వదిలేసి చేతులు దులుపుకోవద్దు’’ అని మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. -
పక్కదారిలో లడ్డూ గోవిందా..
మిలాఖత్ అవుతున్న సిబ్బంది దళారులకు సహకారం.. జోరుగా లడ్డూల అక్రమ దందా భారీగా చేతులు మారుతున్న లడ్డూ స్పందించని టీటీడీ విజిలెన్స్ విభాగం భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూల అక్రమ విక్రయాలు జోరందుకున్నాయి. దళారులతో ఇంటిదొంగలు చేతులు కలిపారు. ఫలితంగా రోజూ రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. అయినా సంబంధిత టీటీడీ విజిలెన్స్ విభాగం మాత్రం చూసీ చూడనట్టుగా ఉంటోంది. దీనివల్ల లడ్డూల మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. తిరుమల: తిరుమల భక్తులకు వెంకన్న దర్శనం ఎంత ముఖ్యమో.. లడ్డూలూ అంతే ముఖ్యం. ఇందుకోసం భక్తుడు ఎంత ఖర్చుచేయడానికికైనా వెనుకాడడు. ఇదే అక్రమార్కులకు వరమైంది. వీరు మాఫియాలా రింగయ్యారు. ప్రధానంగా దళారులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో లడ్డూటోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్ సిబ్బంది, లడ్డూల ట్రే లిఫ్టర్లు ఇలా వరుసగా మిలాఖత్ అయ్యారు. అందరూ కలసి లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తూ అక్రమార్జనలో పడ్డారు. కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ టోకెన్లే ఎక్కువ ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి రూ.30 దాకా ఖర్చు అవుతోంది. కాలిబాట భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తుంటారు. కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. కాలిబాట భక్తులకు ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో 20శాతం వరకు నల్ల బజారుకు తరలిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పద్ధతి ప్రకారమే టోకెన్ల తరలింపు కాలిబాట భక్తులకు ఇచ్చే టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు ఆ కాలిబాట టోకెన్లు ఇస్తారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పద్ధతి ప్రకారం స్కానింగ్ చేస్తారు. అనంతరం వాటిని వెలుపల దళారులకు అందజేశారు. అక్కడే భక్తులకు మంజూరు చేసే రూ.20 రెండు సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్ధతి ప్రకారమే వెలుపుల దళారులకు అందజేసి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. అవసరాన్ని బట్టి కొందరు లడ్డూ కౌంటర్ సిబ్బంది, ట్రే లిఫ్టర్లు తమ వంతుగా చేతివాటంతో దళారులకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. విజిలెన్స్ నిఘా నామమాత్రమే.. టీటీడీ ఈవో, జేఈవో అయినా పట్టించుకోరా? టీటీడీ విజిలెన్స్ విభాగం కొన్నాళ్లుగా డీలా పడింది. లడ్డూ వ్యవహారంపై ఈ విభాగం స్పందించడంలేదు. గతంలో ఇదే విభాగంలో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు పడింది. అప్పట్లో లడ్డూల అక్రమాలు ఆగాయి. తాజాగా ఆరు నెలలుగా ఈ దందా మళ్లీ ఊపందుకుంది. అది కూడా లడ్డూలతో ముడిపడిన అన్ని విభాగాలతో మాఫియాలా దందా పెరిగిపోవడం దారుణం. కనీసం టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ఇన్చార్జి సీవీఎస్వో శ్రీనివాస్.. లడ్డూల అక్రమ దందా అరికట్టడంపై దృష్టి సారించకపోతే భక్తులపై దోపిడీ పెరగటంతోపాటు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. భక్తుల ముసుగులో ఆలయ వీ«ధుల్లోనే మాఫియా తిష్ట లడ్డూ కౌంటర్ కేంద్రం చేసుకుని ఆలయ పడమర మాడ వీధి, ఉత్తరమాడ వీధి, పుష్కరిణి కేంద్రంగా చేసుకుని లడ్డూల మాఫియా తిష్ట వేశారు. ఓ దళారి వద్ద టోకుగా టోకెన్లు ఉంచుకుంటాడు. మరికొందరు దళారులు భక్తులతో బేరసారాలు సాగించి తర్వాత టోకు దళారి నుంచి టోకెన్లు భక్తులకు అందజేస్తారు. కొందరు దళారులు ముందే తీసుకొచ్చిన లడ్డూలు భక్తులకు అందజేస్తూ సొమ్ము చేసుకుంటుంటారు. ఈ అక్రమ వ్యవహారాలు సాగించుకునేందుకు కొందరు దళారులు తరచూ గుండు కొట్టుకోవటం, చేతిలో లగేజీతో సంచరిస్తూ అక్రమ వ్యవహారాలు సంపూర్ణం చేస్తుంటారు. -
శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గింది
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మండిపాటు తిరుమల: నాణ్యతకు మారుపేరుగా ఉండే శ్రీవారి లడ్డూ ప్రస్తుతం నాణ్యత, లడ్డూకు ఉండే ప్రత్యేక తగ్గిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మండిపడ్డారు. సోమవారం రాత్రి ఆయన లడ్డూ కౌంటర్లు పరిశీలించారు. లడ్డూ నాణ్యత, వితరణ పద్ధతులు పరిశీలించారు. లడ్డూలు నాణ్యత తగ్గిందని, గతంలో మాదిరిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదన్నారు. భక్తులకు ఇచ్చే లడ్డూ కూడా టీటీడీ నిబంధనల ప్రకారం 175 గ్రాములు ఉండటం లేదనే ఫిర్యాదులు భక్తులనుండి పెరిగాయన్నారు. భక్తులకు నాణ్యత, పరిమాణంతో కూడిన లడ్డూ అందించేందుకు కృషి చేస్తామన్నారు. లడ్డూ కౌంటర్లు నిర్వహించే సిబ్బందికి ఆయా బ్యాంకులు తక్కువ జీతాలు ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థి ఉందన్నారు. శ్రీవారి సేవకులతో నిర్వహించే కౌంటర్లు ఫిర్యాదులు తగ్గాయన్నారు.