శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు! | Srivari potu wagers salaries hiked | Sakshi
Sakshi News home page

శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు!

Published Wed, Apr 26 2017 2:54 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు!

శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు!

ధర్మకర్తల మండలి తీర్మానాలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలు తయారుచేసే 492 మంది పోటు కార్మికుల వేతనాన్ని రూ. 3 వేల చొప్పున పెంచుతూ మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. టీటీడీ గుర్తింపు కార్డు, రూ. 300 టికెట్ల సుపథం ప్రవేశ మార్గం నుంచి శ్రీవారి దర్శ నానికి అనుమతితోపాటు పోటు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు టీటీడీ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయిం చారు. తిరుపతిలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన సైన్స్‌ మ్యూజియం ఏర్పాటుకోసం 19.25 ఎకరాల టీటీడీ స్థలాన్ని కౌలు ప్రాతిపదికన కేటాయించనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఇక్కడి అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో అనేక అంశాలను తీర్మానించారు.

మరికొన్ని తీర్మానాలివీ..
∙రూ. 2.5 కోట్లతో తిరుమలలో సర్వదర్శ నం భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్‌ నిర్మాణం. ∙టీటీడీ కాటేజీ విరాళ పథకం కింద తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఒక్కోగదికి రూ. 15 లక్షలు, విష్ణునివాసంలో రూ. 10 లక్షలు, ఒక్కో సూట్‌కు రూ. 18 లక్షలు చొప్పున భక్తుల నుంచి స్వీకరించా లని నిర్ణయం. ∙శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని స్వర్ణోత్సవ ఆర్చి వద్ద రూ. 29 లక్షలతో శ్రీవారి ఆలయ నిర్మాణం. ∙ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణకోసం రూ. 3.51 కోట్లు కేటాయించారు.  ∙తెలంగాణలోని నిజామా బాద్‌ జిల్లా బర్దీపూర్‌ గ్రామంలోని శ్రీవేంకటే శ్వరస్వామి, రాజేశ్వరస్వామి త్రితల రాజగో పురం నిర్మాణానికి ఆలయానికి రూ. 25 లక్షలు. ∙ఖమ్మం జిల్లా ఎర్రబోయినపల్లెలో సీతారామస్వామి ఆలయానికి రూ. 23.85 లక్షలు, నీలాద్రిలో వెలసిన శ్రీశివాలయానికి రూ. 46.35 లక్షలు, జమలాపురంలో సత్రం అభివృద్ధికి రూ. 28.70 లక్షల కేటాయింపు.

7 వేల కిలోల శ్రీవారి బంగారాన్ని దీర్ఘకాలిక డిపాజిట్‌లోకి మార్పు: ఈవో
టీటీడీ పలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన దాదాపు 7 వేల కిలోల శ్రీవారి బంగారానికి ప్రస్తుతం స్వల్పకాలిక డిపాజిట్‌పై కేవలం 1 శాతం వడ్డీ మాత్రమే వస్తోందని, త్వరలోనే దీర్ఘకాలికంగా డిపాజిట్‌ చేయనున్నామని, దీనిద్వారా 2.5% వడ్డీ వచ్చే అవకాశముందని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement