
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
సాక్షి, తిరుమల: రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. శంకర్‌నారాయణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆలయానికి విచ్చేసిన వీరికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు. తరువాత జస్టిస్ శంకర్‌నారాయణ కుటుంబసమేతంగా తిరుచానూరు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకుని, కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.