విశాఖలో యుద్ధనౌక విన్యాసాలు ప్రారంభం
నగరానికి చేరుకున్న సింగపూర్ యుద్ధ నౌక
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో భారత్- సింగపూర్ దేశాలకు చెందిన నావికాదళాలు సంయుక్తంగా నిర్వహించే సిమ్‌బెక్స్-16 విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నవంబర్ 2 వరకు ఈ విన్యాసాలు సాగనున్నాయి. దీనికి సంబంధించి సింగపూర్ నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఆదివారం విశాఖకు చేరుకుంది. కల్నల్ ఖో అక్ లీయోంగ్ ఆల్బర్ట్ నేతృత్వంలో 185 మంది స్క్వాడ్రాన్ సిబ్బందితో ఈ నౌక భారత్‌కు చేరుకుంది.
భారత్-సింగపూర్ నావికా దళాల మధ్య వృత్తిపరమైన, సాంస్కృతిక, సాంఘిక, క్రీడారంగాల్లో పరస్పర సహకారానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని నేవీ అధికారులు పేర్కొన్నారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ), ఇంటిగ్రేడెట్ ఆపరేషన్స్ విత్ సర్ఫేస్, ఎయిర్ అండ్ సబ్‌సర్ఫేస్ ఫోర్సెస్, ఎయిర్ డిఫెన్స్ అండ్ సర్వేస్ ఎన్‌కౌంటర్ వంటి అంశాల్లో విన్యాసాలు సాగనున్నాయి. భారత్ తరఫున ఐఎన్‌స్ రన్‌విజయ్, ఐఎన్‌స్ కమోర్త్ యుద్ధనౌకలు పాల్గొననున్నాయి.