వాలీబాల్ పోటీలు ప్రారంభం | start"s the valiball ganes | Sakshi
Sakshi News home page

వాలీబాల్ పోటీలు ప్రారంభం

Published Sat, Feb 15 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

వాలీబాల్ పోటీలు ప్రారంభం

వాలీబాల్ పోటీలు ప్రారంభం

వాలీబాల్ పోటీలు ప్రారంభం
 జియ్యమ్మవలస, :
 రావాడ-రామభద్రపురంలో వాలీబాల్ పోటీల ను ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ షైనీ శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించే గిరిజనోత్సవాలకు ముందుగా ఈపోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.  క్రీడా పోటీలు, చేతిఉత్పత్తులు, గిరి జన అటవీ ఉత్పత్తుల ప్రదర్శన, ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి గిరిజన సాంప్రదాయ నృత్యాలు, టీవీ కళాకారులతో వినోదభరిత కార్యక్రమాలు జరుగునని తెలి పారు.  అనంతరం జరిగిన వాలీబాల్ పోటీలో 22 జట్లు పాల్గొన్నాయి.  పోటీలో ద్రాక్షణి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది.
 కొమరాడలో వాలీబాల్ పోటీలు
 కొమరాడ : కొమరాడ జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలను సర్పంచ్  జి.చిన్నమ్మలు ప్రారంభించారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ జె.నారాయణస్వామి ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 14 జట్లు పాల్గొన్నాయి.  పోటీలో విజేతలకు జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.   కార్యక్రమంలో ఉప సర్పంచ్ పి.లక్ష్మణరావు, పీఈటీలు ఎం. మురళీ, బి. శ్రీనివాసు, బి. చిట్టి,  కార్యదర్శులు స్వాతి, శ్రీను పాల్గొన్నారు.
 భద్రగిరిలో క్రీ డా పోటీలు
 గుమ్మలక్ష్మీపురం : భద్రగిరి ఏపీ రెసిడెన్షియల్ గురుకుల బాలుర పాఠ శాలలో గ్రామ స్థాయి వాలీబాల్ పోటీలను ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా  రేగిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కురాసింగికి చెందిన బృందం ప్రదర్శించిన డప్పు, తుడుము వాయిద్యాలు, కంది కొత్తలు, ఆగమ నృత్యా లు అందరినీ ఆకట్టుకున్నాయి.  ఈ బృందాలను గిరిజ న ఉత్సవాల్లో ప్రదర్శనకు పీఓ ఆహ్వానించారు. వీరికి రవాణా, తదితర సదుపాయాలను ఏర్పాటు చేయాలని డీఈఈ జి.మురళికి ఆదేశించారు.  కార్యాక్రమంలో ఎం ఈఓ బి. భీముడు ఏపీ ఆర్ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్షిపాల్ ఆర్‌ఎస్‌వీజీ కృష్ణారావు, ఎల్విన్‌పేట ఎస్.ఐ గోపి,ఎల్విన్‌పేట సర్పంచ్  రమణ పాల్గొన్నారు.
 ‘క్రీడల్లో గిరిజన యువత రాణించాలి’
 కురుపాం : క్రీడల్లో గిరిజన యువత రాణించాలని ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ అన్నారు.  గిరిజనోత్సవాల్లో భాగంగా స్పందన కార్యక్రమం పేరున స్థానిక గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం వద్ద మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆయన క్రీడాపోటీలకు హాజరైన 14 జట్లకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకొని వాలీబాల్ పోటీలను సర్వీస్ చేసి ప్రారంభించారు.  కార్యక్రమంలో కురుపాం  సర్పంచ్ పి. పద్మావతి, ఎంఈఓ డి.విజయ్‌కుమార్, ఏటీడబ్ల్యూఓ పి. విధ్యారాణి, తహశీల్దార్ బి.నీలకంఠరావు, హెచ్‌ఎం కె.ఆర్.కె.పట్నాయక్ , ఐకేపీ ఏపీఎం బి.వెంకట్, పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement