
సాక్షి, హైదరాబాద్ : మీ నియోజకవర్గ ఎమ్మెల్యే నెలకు ఎంత జీతం అందుకుంటారో తెలుసా? ఏ అలవెన్సుల కింద ఎంత వస్తాయో తెలుసా? వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ప్రజాపతినిధుల భారీ మొత్తంలోనే జీతభత్యాలను అందుకుంటున్నారు. అన్ని అలవెన్సులు, భత్యాలు కలుపుకొని ఒక్కొ ఎమ్మెల్యే సగటు జీతం రూ.1.10 లక్షలు తీసుకుంటున్నారు. ఇటీవల సంత్సరాలలో ఎమ్మెల్యేల జీతం సగటున 120 శాతం పెరగిగింది. దేశంలోని ఎమ్మెల్యేలతో పోలిస్తే తెలంగాణ శాసనసభ్యులు అత్యధిక జీతం రూ.2.50 లక్షలు అందుకుంటున్నారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ ఎమ్మెల్యేలు రూ.2.10 లక్షలు వేతనంగా పొందుతున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నెలవారీ జీతం రూ.1.30 లక్షలతో ఐదో స్థానంలో ఉన్నారు. దేశంలోనే అత్యంత తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు నెలకు రూ. 17,500 తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యేల జీతానికి ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది.
ఎమ్మెల్యే జీతంలో ఏమేమి ఉంటాయో తెలుసా?
ఎమ్మెల్యే తీసుకొనే నెలవారి జీతంలో పలు అలవెన్సులు పొందుపరచి ఉంటాయి. బేసిక్ శాలరీ, ట్రావెలింగ్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్స్‌లతో పాటు ఇతర అలెవన్సులు కూడా ఉంటాయి. విదేశాలతో పోలిస్తే భారత్‌లో గత పదేళ్లలో ఎమ్మెల్యేల జీతం 1200 శాతం పెరిగింది.
తెలంగాణ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేల జీతం ఏకంగా 170 శాతం పెరిగింది. నెలకు రూ. 2.50 లక్షలు అందుకుంటున్నారు. వీటిలో బేసిక్ శాలరీ రూ.20 వేలు కాగా రూ.2.30 లక్షలు నియోజక వర్గ అలవెన్సులు. ఒక ముఖ్యమంత్రి జీతం కూడా 72 శాతం పెరిగింది. గతంలో రూ.2.44 లక్షలు ఉండగా ఇప్పుడు రూ 4.21 లక్షలకు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ : తెలంగాణ ప్రభుత్వం జీతభత్యాలు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 30.63 కోట్ల అదనపు భారం పడుతుంది. ముఖ్యమంత్రి విషయానికొస్తే.. నెలకు రూ. 1.40 లక్షలు తీసుకుంటారు. వీటి నుంచి సీఎం ట్రావెలింగ్ అలవెన్సులను మినహాయించారు. అంటే ఇతర ఎమ్మెల్యేల మాదిరి కాకుండా అదనంగా ట్రావెలింగ్ అలవెన్సులు చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment