బాల్య వివాహం నిలుపుదల | Stopping child marriage at srikakulam district | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం నిలుపుదల

Published Sat, Mar 18 2017 3:22 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Stopping child marriage at srikakulam district

కొత్తూరు: మండలంలోని కడుము కాలనీలో శుక్రవారం జరగనున్న బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలోని గువ్వాడ అప్పలస్వామి, జయమ్మ దంపతుల కుమార్తె(15)కు.. అదే ప్రాంతానికి చెందిన గోవిందరావుతో శుక్రవారం రాత్రి వివాహం చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి కుమార్తె కడుము జెడ్‌పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష నివాగంలో రాసింది. అయితే, దీనిపై అందిన ఫిర్యాదు మేరకు చైల్డ్‌ కేర్‌ సంస్థ కోఆర్డినేటర్‌ జి.జగన్నాథం, వీఆర్వో బలగ అప్పారావు నాయుడు, ఐసీడీఎస్, పోలీస్‌ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లి చేస్తామని వారి నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement