అమరావతిలో పోలీసు దళం పటిష్టం
కొత్తగా ఒక డీఎస్పీ, 673 మంది సిబ్బంది ఏర్పాటు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో పోలీసుల సంఖ్యను పెంచుతూ హోంశాఖ మంగళవారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 97 మంది పోలీసు సిబ్బందికితోడు ఒక డీఎస్పీని, మరో 673 మందిని కేటారుుస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏఆర్ అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నేపథ్యంలో తుళ్లూరు పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసును మరింత పటిష్టమవుతోంది. దీని పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లు ఉండగా, ఒక్కో స్టేషన్‌లో పోలీసు సిబ్బంది సంఖ్యను 120కి పెంచారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌తోపాటు ఐదు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సైబర్ టెక్నాలజీ గ్రూప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్సును మరింత పెంచారు. అమరావతికి కొత్తగా కేటారుుంచిన వారిలో ఒక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 49 మంది ఏఎస్సైలు, 101 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 480 మంది కానిస్టేబుళ్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లు, ఒక టైపిస్టు, ముగ్గురు అఫీసు సబార్జినేట్‌లు ఉన్నారు.
ఐదు గ్రామాల్లో ఔట్‌పోస్టులు: వెంకటపాలెం, వెలగపూడి, శాఖమూరు, పెదపరిమి, వడ్లమానూరు గ్రామాల్లో ఏర్పాటు చేసే ఔట్‌పోస్టులకు ఐదుగురు ఎస్సైలు, 15 మంది ఏఎస్సైలు, 15 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లుతో కలిపి మొత్తం 98 మందిని కేటారుుంచారు. ఈ ఔట్‌పోస్టులన్నీ తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తారుు. సైబర్ టెక్నాలజీ గ్రూపును పటిష్టం చేస్తూ అదనంగా 40 మంది కానిస్టేబుళ్లను కేటారుుంచారు. గుంటూరు రూరల్ పోలీస్ జిల్లా పరిధిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్ విభాగానికి అదనంగా ఒక రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఆర్‌ఎస్సైలు, 9 మంది అసిస్టెంట్ ఆర్‌ఎస్సైలు, 27 మంది రిజర్వ్‌డ్ హెడ్ కానిస్టేబుళ్లు, 108 మంది రిజర్వ్ కానిస్టేబుళ్లను కేటారుుంచారు.