ఒంగోలు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విషాదం నెలకొంది. పాఠశాల బాత్రూమ్ స్లాబ్ కూలి ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. వాటర్ ట్యాంక్ కోసం విద్యార్థి ఇటుకలు మోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్లాబ్ కూలిన సమయంలో ఇటుకలు మోస్తున్న ఆరో తరగతి విద్యార్థి మేడికొండ నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థులతో పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
స్లాబ్ కూలి విద్యార్థి మృతి
Published Wed, Jan 22 2014 3:00 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement