జలుమూరు: శ్రీకాకుళం జిల్లా జలుమూరులో ఎస్సీ బాలికల వసతిగృహానికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ విషయం బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని వసతిగృహానికి తిరిగి రాగా, రక్తస్రావం అవుతున్న ఆమెను మేట్రన్ సూర్యప్రభ ప్రశ్నించారు. దీంతో తనపై జగన్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టు ఆమె వెల్లడించిందని సమాచారం. దీంతో మేట్రన్ పోలీసులకు సమాచారం అందించగా... వారు అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.