కాకినాడ మేయర్‌గా సుంకర పావని
తొలుత అడ్డూరి వరలక్ష్మి అభ్యర్థిత్వం ఖరారైందని ప్రచారం జరిగినా చివరి క్షణంలో సుంకర పావని పేరు తెరపైకి వచ్చింది. దీన్ని చినరాజప్ప అధికారికంగా ప్రకటించిన అనంతరం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌కు చేరుకుని ఆమెను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా కాలా సత్తిబాబు ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన సుంకర లక్ష్మీ ప్రసన్న, ఎమ్మెల్యే వనమాడి ప్రతిపాదించిన అడ్డూరి వరలక్ష్మిలకు నిరాశ ఎదురైంది. మేయర్ పదవిని ఆశించిన మాకినీడి శేషుకుమారి తనకు అవకాశం దక్కకపోవడంతో పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి కన్నీళ్లతో నిష్క్రమించారు.