
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజనకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు డిసెంబరు 15 నాటికి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విభజన జరుగకుండా కొత్త జడ్జీల నియామకం చేపడితే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాబట్టి.. వీలైనంత త్వరగా విభజన పూర్తైతే మంచిదని అభిప్రాయపడింది. అమరావతిలో తాత్కాలిక కోర్టు భవన నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మార్చి లేదా ఏప్రిల్ నాటికి స్టాఫ్ క్వార్టర్స్, జడ్జీల నివాసాలు నిర్మిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment