రెండేళ్ల క్రితం రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2011లో జరిగిన ప్రిలిమ్స్లో ఆరు ప్రశ్నలను తొలగించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. కొత్తగా మెరిట్ జాబితాను తయారు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది.