
ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును అభినందిస్తున్న మాజీ ఎండీ మాలకొండయ్య
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఎన్‌వి సురేంద్రబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను కలసి అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీ మాలకొండయ్యతో కలసి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికులకు మంచి సేవలు అందించడానికి కృష్టి చేస్తానన్నారు.
ఆర్టీసీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకాకుండా చూస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment