ఏలూరు, న్యూస్‌లైన్:
జిల్లాలో సాధారణ ఎన్నికల సమయంలో వార్తల ముసుగులో పెయిడ్ ఆర్టికల్స్ ప్రచురించినా, ప్రసారం చేసినా ప్రత్యేక నిఘా పెడతామని.. వీటిని ఎన్నికల ఖర్చు ఖాతాలో పొందుపరుస్తామని కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం మీడియా సర్టిఫికేషన్, మోనిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెయిడ్ ఆర్టికల్స్‌ను ప్రతిరోజూ పరిశీలించి నివేదికను ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందజేస్తామన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనల సమాచారానికి సంబంధించి మీడియా ప్రతినిధులు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కో రారు. సమాచార శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వి.భాస్కర నరసింహం మాట్లాడుతూ ఇతరులను కించపరిచే, రెచ్చగొట్టేలా ప్రకటనలు ఉండకూడదని సూచించారు.
ఏలూరులో మీడియా సెంటర్
సాధారణ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా త్వరలో ఏలూరులో మీడియా సెంటర్‌ను ఏ ర్పాటు చేస్తామని కలె క్టర్ తెలిపారు. ఎన్నికల నిబంధనల సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపిస్తున్నామని చెప్పారు. కమిటీ కన్వీనర్, డీపీఆర్‌వో భాస్కరనారాయణ, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, జె. వెంకటేశ్వరరావు, ఎం. శ్రీహరిరావు, మీడి యా ప్రతినిధులు కె.మాణిక్యరావు, జి.రఘురాం, మురళీ, బీవీ రామాంజనేయు లు, నాగరాజు పాల్గొన్నారు.
రేపు ఓటర్ల నమోదు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని.. ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. ఓటు నమోదు చేసుకోనివారి కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని చెప్పారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉద యం 10 గంటల నుంచి సాయంత్ర 5 గం టల వరకూ ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచామని, చేర్పులు, మార్పుల కోసం కూడా అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు
పెయిడ్ ఆర్టికల్స్‌పై ప్రత్యేక నిఘా
Published Sat, Mar 8 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement