రాజధానిపై అనుమానాలు రేకెత్తించొద్దు
అమరావతి : అమరావతిపై మీడియూలో కథనాలలతో అనుమానాలు రేకిత్తించవద్దని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సోమవారం శ్రీహిత డెవలపర్స్ అధినేత, టీడీపీ మండల నాయకుడు ఆలోకం సుధాకర్‌బాబు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిపై కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాజధాని భూ సమీకరణపైనా, భూముల కొనుగోలుపై వింత బాష్యాలు చెప్పడం సరికాదని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై దుమ్మెత్తిపోయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసైన్ట్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు. రైతులు, కూలీల్లో ఉన్న అనుమానాలు పోగొట్టేందుకు త్వరలో రాజధానిలో పర్యటిస్తానన్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు.