బిర్యానీ బకెట్ చాలెంజ్!
హైదరాబాద్: రైస్ బకెట్ చాలెంజ్ కు నగరానికి చెందిన ఓ స్టార్ హోటల్ యాజయాన్యం స్పందించింది. బిర్యానీ బకెట్ చాలెంజ్ కు సిద్దమయింది. హైదరాబాద్ లో ప్రఖ్యాతి గాంచిన బిర్యానీ పేదలకు పంచాలని తాజ్ ఫలక్నుమా హోటల్ నిర్ణయించింది. రేపు(శుక్రవారం) పేదలకు 500 బిర్యానీ ప్యాకెట్లు పంచనున్నట్టు తాజ్ ఫలక్నుమా జనరల్ మేనేజర్ గిరీష్ సెహగల్ తెలిపారు.
ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ చేతులుగా వీటిని పంచాలని భావిస్తున్నట్టు చెప్పారు. సప్నా ఇక్తారా ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. పేదవారికి సహాయం చేసేందుకు రైస్ బకెట్ చాలెంజ్ ను నగరానికి చెందిన జర్నలిస్టు మంజులత కళానిధి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.