టాటా ‘జెస్ట్’ కారు మార్కెట్‌లోకి విడుదల
విజయవాడ : టాటా మోటార్స్ కొత్త ఉత్పాదన జెస్ట్ కారును శుక్రవారం లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. బ్యాంక్ కాలనీలోని జాస్పర్ షోరూమ్‌లో ఆ సంస్థ డెరైక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.వి.సత్యనారాయణరావు, టాటా మోటార్స్ పాసింజర్ కార్స్ స్టేట్ హెడ్ కె.కళ్యాణిరెడ్డిలు కారును మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టారు.
అనంతరం టాటా మోటార్స్ పాసింజర్ కార్స్ సేల్స్ మేనేజర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకూ లేనివిధంగా జెస్ట్ కార్‌ను 29 సరికొత్త విశిష్టతలతో విడుదల చేసినట్లు చెప్పారు. 1.2 టర్భో పెట్రోల్ ఇంజన్‌తో మల్టీడ్రైవ్ మోడ్(సిటీ,ఎకో,స్పోర్ట్స్) కలిగివున్నట్లు తెలిపారు. నాలుగు మోడల్స్‌తో ప్రారంభపు ధర రూ.4.64లక్షలుగా పేర్కొన్నారు. డీజీల విభాగంలో ఐదు మోడల్స్‌లో ప్రారంభపు ధర రూ.5.69గా పేర్కొన్నారు.
మొదటి సారిగా ఆటోట్రాన్స్‌మిషన్ సౌకర్యంతో ఆరు అద్భుతమైన రంగుల్లో లభ్యమవుతాయన్నారు. పెట్రోలు కారు లీటరుకు 17.6 కి.మీ, డీజిల్ కారు 23 కి.మీ మైలేజీ వస్తుందని తెలిపారు. మూడేళ్లు, లేదా లక్ష కి.మీ వారంటీ, మూడేళ్లు లేదా 45 కి.మీ వరకూ ఉచిత మెయింటెనెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ జనరల్ మేనేజర్ వి.పరమేశ్వరరావు, కస్టమర్లు, వివిధ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.