satyanarayana rao
-
సింగరేణిలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
జైపూర్ (చెన్నూర్)/ సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ (ఎస్టీపీపీ) కేంద్రానికి సంబంధించిన జలాశయంపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ డి.సత్యనారాయణరావు ఈ ప్లాంట్‌ను ప్రారంభించి తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఉద్యోగులు, అధికారులను అభినందించారు. ఇక్కడే ఏర్పాటు చేస్తున్న మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, 3 దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కు సింగరేణి సంస్థ మూడేళ్ల కార్యాచరణ ప్రారంభించింది. మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం–3, మందమర్రి ఏరియాల్లో నిర్మించింది. వీటి ద్వారా 540 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, సంస్థ విద్యుత్ ఖర్చుల్లో రూ.300 కోట్లను సింగరేణి సంస్థ ఆదా చేసింది. మూడో దశ కింద 81 ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మించే బాధ్యతలను నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్ట మ్స్ సంస్థకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీటీసీ సంజయ్‌కుమార్, జీఎం డీవీఎస్ఎన్ సూర్యనారాయణ రాజు, జీఎం (సోలార్) జానకి రాం, ఎస్వోటు డైరెక్టర్ సూర్యకు మార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శేషారావు, జీఎం పీసీఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఏజీఎం సత్యనారాయణప్రసాద్, సీఎంవో ఏఐ కేంద్ర ఉపాధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, టీబీజీ కేఎస్ ఉపా«ధ్యక్షుడు చుక్కల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విలువలకు ప్రతీక.. ఎమ్మెస్సార్
బంజారాహిల్స్(హైదరాబాద్): కాంగ్రెస్ దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) విలువలకు ప్రతీకగా నిలిచారని, ఆ విలువలు ఉన్నందునే రాజకీయాల్లో సుదీర్ఘంగా రాణించారని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెస్సార్ జీవిత చరిత్రను ఆయన అల్లుడు వామనరావు రాయగా ఆ పుస్తకాన్ని మంగళవారం సోమాజిగూడలోని ఐటీసీ కాకతీయ హోటల్లో దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెస్సార్ ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడని, నీతి, నిజాయతీ గల గొప్ప నేత అని కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో కొత్తవారిని ఎమ్మెస్సార్ ఎంతగానో ప్రోత్సహించేవారని, తాను ఆయన వద్ద రాజకీయ కార్యదర్శిగా పని చేశానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. డబ్బుంటేనే రాజకీయాల్లో రాణిస్తారనే విషయాన్ని పక్కనపెట్టి ఎదిగిన గొప్ప నాయకుడు ఎమ్మెస్సార్ అని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైఎస్సార్ సీఎం అయినప్పుడు ఎమ్మెస్సార్ స్పీకర్ కావాలనుకున్నారని, అయితే తాను అందుకు చొరవ చూపలేకపోయానని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ విషయం తాను వైఎస్సార్‌కు కూడా చెప్పలేదన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌కు పునాది వేసింది వైఎస్సార్, ఎమ్మెస్సార్‌లేనని గుర్తు చేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో విడదీయరాని అనుబంధం ఉన్న ప్రజానాయకుడు ఎమ్మెస్సార్ అని, ఉన్నదున్నట్లు మాట్లాడటంలో ఆయనకు ఎవరూ సాటిరారని టీపీసీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో రానున్న నాలుగేళ్లలో ప్రస్తుతం సాధిస్తున్న 65 మిలియన్ టన్నుల బొగ్గు లక్ష్యాన్ని 100 మిలియన్ టన్నులు సాధించేందుకు అధికారులు, కార్మికులు సమిష్టిగా సాధించేందుకు కృషి చేస్తానని సింగరేణి సంస్థ నూతన డైరెక్టర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానిక్ (ఈఅండ్ఎం) దొగ్గ సత్యనారాయణరావు తెలిపారు. డైరెక్టర్ ఈఅండ్ఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో సింగరేణిలో సీఅండ్ఎండీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆయన సూచనలు, సలహాలతో రూ.490 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి అయిదేళ్లలో రూ.1700 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు తెలిపారు. వాటిలో రూ.కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో చెల్లించటమే కాకుండా కార్మికులకు 28శాతం వాటా కింద రూ.494 కోట్లను చెల్లించటం జరిగిందన్నారు. దీనిలో సీఅండ్ఎండీ పాత్ర కీలకం అన్నారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వివిధ రాష్ట్రాల్లో బొగ్గు పరిశ్రమలతోపాటు మహారత్న కంపెనీలకు దీటుగా పనిచేసి పలువురి ప్రశంసలు పొందిందన్నారు. ఇటువంటి సంస్థలో తనకు డైరెక్టర్‌గా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటిì వరకు బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా విరాజిల్లుత్ను సింగరేణి.... విద్యుత్ రంగంతో పాటు సోలార్ పవర్లో తనవంతు సత్తాను చూపనుందని, ఇందుకోసం మూడు స్టేజీలలో సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో దశలవారీగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, దానిలో భాగంగా నవంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తై సింక్రనైజేషన్ అవుతుందని ఆకాంక్షించారు. మిగతా రెండు దశల పనులు కూడా రానున్న రెండేళ్లలో పూర్తికానున్నామయని వివరించారు. కరోనా వైరస్ వచ్చిన తరువాత దేశం 23.4 శాతం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నట్లు ఆర్థికవేత్తలు ప్రకటించారని, ఈ ప్రభావం సింగరేణిపై కూడా పడిందని చెప్పారు. ఈక్రమంలో సంస్థ సుమారు 17 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకంజలో ఉందని, ఈ నష్టాన్ని తోటి డైరెక్టర్లు , కిందిస్థాయి ఉద్యోగులతో చర్చించి బ్యాలెన్స్ చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్థానన్నారు. బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) విధానాన్ని బలోపేతం చేసి నిఘా వ్యవస్దను పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. సత్తుపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్ పనులను వేగవం తం చేసి, బొగ్గు లారీల ద్వారా జరిగే ప్రమాదాలను నివారింపజేస్తామన్నారు. ఉత్పత్తి పెంచాలి.. ఇల్లెందు: సింగరేణి నూతన డైరెక్టర్ (ఈఅండ్ఎం) గా బాధ్యతలు చేపట్టిన డి.సత్యనారాయణ సింగరేణి పుట్టినిల్లైన ఇల్లెందు ఏరియాలో మంగళవారం పర్యటించారు. ఏరియా జీఎం పి.వి. సత్యనారాయణ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ ఏరియాలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలన్నారు. కోవిడ్ దృష్ట్యా బొగ్గు కొనుగోలు కొంత తగ్గినా ఇప్పుడు బొగ్గుకు డిమాండ్ పెరుగుతుందని, ఉత్పత్తితో పాటు రవాణాను కూడా పెంచాలని సూచించారు. అనంతరం జేకేఓసీ సమీపంలోని సోలార్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు జానకిరామ్, సీహెచ్. లక్ష్మీనారాయణ, నర్సింహరావు ఉన్నారు. మళ్లీ అవాంతరం ‘కేటీపీఎస్’లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)5 దశ కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తికి అవాంతరం ఏర్పడుతోంది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో 250 మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో ఆధునికీకరణ ముగిసి, సింక్రనైజేషన్ చేసినప్పటికీ చిక్కులు వీడట్లేదు. ఉత్పత్తి తరచూ నిలిచిపోతుందడటంతో జెన్కో సంస్థకు కోట్లాది రుపాయల నష్టం ఏర్పడుతోంది. నాలుగు రోజుల కిందట కర్మాగారంలో అధిక వైబ్రేషన్స్(ప్రకంపనలు) రావడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. బీహెచ్ఈఎల్ సంస్థకు సమాచారం అందించి మరోమారు మరమ్మతులు చేపట్టారు. 5వ దశ కర్మాగారంలోని 9, 10యూనిట్ల ఆధునికీకరణ పనులను గత జూన్ 8వ తేదీన చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది టెక్నీషియన్లతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి గత ఆగష్టు 12న సింక్రనైజేషన్ చేసి ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే టర్బైన్‌లో సాంకేతిక సమస్యతో ఉత్పత్తి పలుమార్లు నిలిచింది. తాజాగా బేరింగ్లు మార్చేందుకు భూపాలపల్లిలోని కేటీపీపీ నుంచి తెప్పించారు. మంగళవారం 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10వ యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడి యూనిట్‌ను నిలిపివేశారు. మొత్తంగా 500 మెగావాట్ల ఉత్పత్తి ఆగింది. త్వరలోనే అందుబాటులోకి.. 9వ యూనిట్లో అధిక ప్రకంపనల కారణంగా బీహెచ్ఈఎల్ సంస్థ టెక్నీషియన్ల ద్వారా మరమ్మత్తులు చేయిస్తున్నాం. ఆధునికీకరణ తర్వాత కొన్ని కారణాలతో సమస్యలు వస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – కె.రవీంద్ర కుమార్, సీఈ, కేటీపీఎస్ 5,6 దశలు -
సింగరేణికి కొత్త డైరెక్టర్లు..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఇద్దరు కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రాజెక్టులు, ప్లానింగ్ (పి–పి) విభాగం డైరెక్టర్‌గా బి.వీరారెడ్డి, ఎలక్ట్రికల్–మెకానికల్ విభాగం డైరెక్టర్‌గా డి.సత్యనారాయణను నియమించింది. ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టుల భర్తీకి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిద్దరి పేర్లను ఖరారు చేసింది. కమిటీలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, కోలిండియా నుంచి శేఖర్ సరన్, కేంద్ర బొగ్గు శాఖ సెక్రటరీ పి.ఎస్.ఎల్.స్వామి ఉన్నారు. వీరారెడ్డి గతంలో అడ్రియాల లాంగ్ వాల్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. డి.సత్యనారాయణ రావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ (పి–పి) పోస్టులకు మొత్తం ఐదుగురు సీనియర్ జనరల్ మేనేజర్ హోదాలు కలిగిన వీరారెడ్డి, జి.వెంకటేశ్వరరెడ్డి, ఎస్.డి.ఎం. సుభానీ, కె.గురవయ్య, హబీబ్ హుస్సేన్‌లను, డెరైక్టర్ (ఎక్ట్రికల్–మెకానికల్) పోస్టులకు సీనియర్ జనరల్ మేనేజర్ హోదా కలిగిన డి.సత్యనారాయణ రావు, జి.ఎస్. రాంచంద్రమూర్తి, ఎం.నాగేశ్వర్ రావు, డి.వి.ఎస్.సూర్యనారాయణలను పిలిచారు. -
సెన్సేషన్ సత్తెన్న
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్రం సాధించే స్థాయికి చేరుకోవడానికి కీలక సూత్రధారి ఆయన. ఈయన విసిరిన ఒకే ఒక్క సవాల్.. కేసీఆర్ ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా మారడానికి కారణమైంది. ఆ సవాలే ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ను దూరం చేసింది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఆయన మాటకు అంతటి పవర్.. ఉన్నదున్నట్లు మాట్లాడే కచ్చితత్వం ఆయన సొంతం. నోటి మాటతో ఎక్కువగా స్వపక్షాన్నే ఇబ్బంది పెట్టిన విలక్షణ నాయకుడు. ఆయనే సంచలనాల సత్తెన్న. ఎమ్మెస్సార్‌గా పిలిచే మెన్నేని సత్యనారాయణరావు.- వొద్దమల్ల విజయభాస్కర్, కరీంనగర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన సత్యనారాయణరావు రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత. పార్టీ, ప్రభుత్వ పదవులను అవలీలగా నిర్వహించిన ఘననేత. ఆరు రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జ్గా పనిచేసిన అనుభవం ఆయనది. నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్‌గాంధీ వరకు మూడు తరాల నాయకత్వంలో పనిచేసిన ఏకైక నేత. పైకి ఒకలా.. లోపల మరోలా మాట్లాడడం ఆయనకు తెలియదు. గవర్నర్ కావాలనే ఒక్క కోరిక మాత్రం మిగిలి ఉందని బాహాటంగానే చెప్పేవారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు తిన్నారు. కానీ 2006లో మాత్రం ‘తెలంగాణ అంటే చెప్పుతో కొడతా’నన్నారు. ఆ మాట వివాదాస్పదమైనా.. అలా అనగలగడం ఆయనకే చెల్లింది. అదే ఎమ్మెస్సార్ స్టైల్. నాటి యూత్ లీడర్ ఎమ్మెస్సార్ సంక్రాతి రోజున పుట్టారు (1934, జనవరి 14న). ఎమ్మెస్సార్, రెండు పదుల వయస్సులోనే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 1954 నుంచి 1969 వరకు విద్యార్థి, యువజన కాంగ్రెస్‌లో కీలక పాత్ర నిర్వర్తించారు. 1969 నుంచి 1971 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. జైలుకు కూడా వెళ్లారు. 1971లో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన ఎమ్మెస్సార్ ఇక ఆ పదవిని వదలలేదు. వరుసగా 14 ఏళ్ల పాటు, 1985 వరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ సమయంలోనే ఇందిరాగాంధీ నాయకత్వంలో 1980 నుంచి 1983 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత ఆయన దృష్టి కేంద్రం నుంచి రాష్ట్రం వైపు మరలింది. 1990లో తొలిసారి ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులై, ఆ పదవిలో 1994 వరకు కొనసాగారు. 2000లో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. 2004 సాధారణ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన, ఆ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి గెలిచి 2004 నుంచి 2007 వరకు మంత్రిగా కొనసాగారు. కేసీఆర్‌కు విసిరిన సవాల్ కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఖాళీగా లేరాయన. సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టీసీ చైర్మన్‌గా పూర్తి కాలం పదవిలో కొనసాగి.. అటు సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీల చేత ఔరా అనిపించుకున్నారు. ఆ సవాల్.. పెను ఉప్పెన రాజకీయ రంగంలో ఉంటూ ‘తాను చెప్పదలుచుకున్న విషయాన్ని లౌక్యంగా చెప్పడం’ అనే ప్రాథమిక లక్షణాన్ని మాత్రం ఒంటపట్టించుకోలేదు ఎమ్మెస్సార్. ఎప్పుడూ ఏదో మాటతో సంచలనాలకు కారణమయ్యేవారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేయగా, కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెస్సార్, లోక్‌సభ నుంచి కేసీఆర్ గెలుపొందారు. ఆ తరువాత కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కొంచెం నెమ్మదించినట్లు ఉండింది. అప్పుడు ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘కేసీఆర్ మంత్రి పదవి తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని పడుకోబెట్టిండు. కాంగ్రెస్‌తోనే పదవి వచ్చింది. రాజీనామా చేసి తిరిగి గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా’’నంటూ సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్య సంచలనమైంది. దీనికి తీవ్రంగా స్పందించిన కేసీఆర్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలోనే కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో ‘తెలంగాణ అంటే చెప్పుతో కొడుతా’నంటూ ఓ టీఆర్ఎస్ నాయకునిపై ఎమ్మెస్సార్ విరుచుకుపడి కలకలం సృష్టించారు. చివరకు కేసీఆర్ రికార్డు స్థాయి మెజార్టీ సాధించడంతో.. మాటకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ చరిత్రలో రెండు లక్షల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన కేసీఆర్.. ఢిల్లీ గద్దెపై ఉన్న పెద్దల దృష్టిని ఆకర్షించారు. ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ ప్రభావం రెట్టింపైంది. చివరకు రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. కాంగ్రెస్‌పై గెలుపు ఎమ్మెస్సార్ కరీంనగర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల జగపతిరావుపై 56,323 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి బీఎల్డీ అభ్యర్థి జువ్వాడి గౌతమ్‌రావుపై 1,14,488 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావుపై 1,56,328 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి దేవాదాయ శాఖ మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్‌గా కొనసాగారు. పట్టుపట్టిండంటే.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఆర్టీసీ చైర్మన్, పీసీసీ చీఫ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంటి ఎన్నో పదవులను అలంకరించి రాజకీయాల్లో సీనియర్ అయిన ఎమ్మెస్సార్ పట్టుపట్టిండంటే, అది జరగాల్సిందే. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలవతో కొద్ది నెలల్లోనే రెండోసారి ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీపై తనదే ఆధిపత్యం ఉండాలని, ఎవరూ జోక్యం చేసుకోరాదనే ముందుచూపుతో ప్రత్యేకంగా జీఓను తీసుకురావడమే కాక, అప్పటి వరకు ఉన్న జోనల్ చైర్మన్ల వ్యవస్థనే రద్దు చేయించిన గట్టి పట్టుదల కలిగిన నాయకుడు ఎమ్మెస్సార్. -
అవినీతిపరులపై లోకాయుక్త పంజా
బెంగళూరు : అవినీతి అధికారులపై లోకాయుక్త మళ్లీ పంజా విసిరింది. బెంగళూరు, మైసూరు, కోలారు, తుమకూరు, యాదగిరి, గుల్బర్గాలలో మంగళవారం వేకువ జామున ఏక కాలంలో అధికారులు దాడులు చేశారు. ఆ అధికారుల ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వారి వద్ద రూ.8.89 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వారి బ్యాంక్ అకౌంట్లు, లాకర్లను సీజ్ చేశారు. వాటిలోని సొమ్ము, పొలాలు, ఇంటి స్థలాల విలువ ఇంకా తేలాల్సి ఉంది. ఏడీజీపీ సత్యనారాయణరావు తెలిపిన వివరాల మేరకు.. = రామకృష్ణయ్య.. మైసూరులో రిమ్యాండ్ హోంలో సీడీపీఓ ఉద్యోగి. ఈయన అక్రమంగా రూ 4.52 కోట్ల ఆస్తులు సంపాదించారు. = ఉమేష్.. తుమకూరులో టీచర్ శిక్షణ సంస్థలో ఎఫ్‌డీఏ. అక్రమ ఆస్తి రూ. 1.20 కోట్లు = శివనంజప్ప.. బెంగళూరు నగరంలోని బనశంకరిలో అసిస్టెంట్ తహశీల్దార్. అక్రమ ఆస్తి రూ. 1.19 కోట్లు = సీతారాం.. బెంగళూరులోని హలసూరులో పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీరు. అక్రమ ఆస్తి రూ. 89. 50 లక్షలు = భీమారావు.. యాదగిరి జిల్లా శహపుర తాలూకా పంచాయతీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీరు. అక్రమ ఆస్తి రూ. 76.67 లక్షలు = జగదీష్.. కోలారు నగర సభ కమిషనర్. అక్రమ ఆస్తి రూ. 69.75 లక్షలు = శివానంద కామత్.. శివమొగ్గలో ఆహార పౌర సరఫరాల శాఖలో ఫుడ్ ఇన్స్పెక్టర్. ఆస్తి రూ. 49.50 లక్షలు -
టాటా ‘జెస్ట్’ కారు మార్కెట్లోకి విడుదల
విజయవాడ : టాటా మోటార్స్ కొత్త ఉత్పాదన జెస్ట్ కారును శుక్రవారం లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. బ్యాంక్ కాలనీలోని జాస్పర్ షోరూమ్‌లో ఆ సంస్థ డెరైక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.వి.సత్యనారాయణరావు, టాటా మోటార్స్ పాసింజర్ కార్స్ స్టేట్ హెడ్ కె.కళ్యాణిరెడ్డిలు కారును మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. అనంతరం టాటా మోటార్స్ పాసింజర్ కార్స్ సేల్స్ మేనేజర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకూ లేనివిధంగా జెస్ట్ కార్‌ను 29 సరికొత్త విశిష్టతలతో విడుదల చేసినట్లు చెప్పారు. 1.2 టర్భో పెట్రోల్ ఇంజన్‌తో మల్టీడ్రైవ్ మోడ్(సిటీ,ఎకో,స్పోర్ట్స్) కలిగివున్నట్లు తెలిపారు. నాలుగు మోడల్స్‌తో ప్రారంభపు ధర రూ.4.64లక్షలుగా పేర్కొన్నారు. డీజీల విభాగంలో ఐదు మోడల్స్‌లో ప్రారంభపు ధర రూ.5.69గా పేర్కొన్నారు. మొదటి సారిగా ఆటోట్రాన్స్‌మిషన్ సౌకర్యంతో ఆరు అద్భుతమైన రంగుల్లో లభ్యమవుతాయన్నారు. పెట్రోలు కారు లీటరుకు 17.6 కి.మీ, డీజిల్ కారు 23 కి.మీ మైలేజీ వస్తుందని తెలిపారు. మూడేళ్లు, లేదా లక్ష కి.మీ వారంటీ, మూడేళ్లు లేదా 45 కి.మీ వరకూ ఉచిత మెయింటెనెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ జనరల్ మేనేజర్ వి.పరమేశ్వరరావు, కస్టమర్లు, వివిధ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్‌తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.2 వేల కోట్లు వెచ్చించి సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పట్టించబోతున్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్-14 ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజన విద్యార్థులకు హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో ప్రతిభావంతులైన 44 మంది ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను అమెరికాకు పంపామని చెప్పారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కూడా మరో రూ. 2 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. పేదరికం నిర్మూలన చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అందరం సమైక్యాంధ్ర ఉద్యమంలో నిమగ్నమైనందున ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. భవిష్యత్తులో వైభవంగా నిర్వహించి ఈ ప్రాంత ప్రకృతి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేం దుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలిలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులం తమ గళాన్ని వినిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అదేమని అడిగితే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేయిచేసుకునే పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే పరసా రత్నం మాట్లాడుతూ ఏటా మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించాలన్నారు. సూళ్లూరుపేట పట్టణ అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పక్షుల పండగలో పాలుపంచుకున్న వారందరికీ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెమెంటోలు అందజేశారు.